Page Loader
US Open: సెమీస్‌కు చేరిన లక్ష్య సేన్, సింధు ఓటమి
సెమీస్‌కు చేరిన లక్ష్య సేన్, సింధు ఓటమి

US Open: సెమీస్‌కు చేరిన లక్ష్య సేన్, సింధు ఓటమి

వ్రాసిన వారు Stalin
Jul 15, 2023
06:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ యూఎస్ ఓపెన్-2023 పురుషుల సింగిల్స్‌లో సత్తా చాటాడు. సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు తన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్య‌సేన్ 21-10, 21-17తో ఎస్.శంకర్ ముత్తుసామి సుబ్రమణియన్‌పై విజయం సాధించాడు. ప్రస్తుతం బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో 12వ ర్యాంక్‌లో ఉన్న సేన్ ఫైనల్‌లో స్థానం కోసం ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్, చైనాకు చెందిన ప్రపంచ నం. 7 లీ షి ఫెంగ్‌తో తలపడనున్నాడు. గత వారం కెనడా ఓపెన్ ఫైనల్‌లో ఈ ఇద్దరు షట్లర్లు తలపడ్డారు. ఆ గేమ్‌లో లక్ష్య సేన్ విజేతగా నిలిచాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీఏఐ చేసిన ట్వీట్