Lionel Messi detained: పోలీసుల అదుపులో లియోనల్ మెస్సీ..ఎందుకంటే!
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
తాజాగా అతని అభిమానులకు షాకింగ్ న్యూస్ తగిలింది. బీజింగ్ ఎయిర్ పోర్టులో మెస్సీని చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని పాస్ పోర్టులో సమస్య తలెత్తడంతో పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
బీజింగ్‌లోని వర్కర్స్ స్టేడియంలో గురువారం ఆస్ట్రేలియాతో అర్జెంటీనా ఫెండ్లీ మ్యాచ్ ఆడనుంది. దీంతో అర్జెంటీనా జట్టుతో మెస్సీ చైనాకు వెళ్లాడు.
చైనా వీసా కోసం మెస్సీ అప్లై చేసుకోకపోవడంతో పోలీసులు మెస్సీని ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు.
Details
30 నిమిషాలు ఎయిర్ పోర్టులోనే మెస్సీ
మెస్సీ వద్ద అర్జెంటీనా, స్పానిష్ పాస్ పోర్టులు ఉన్నాయి. అయితే స్పానిష్ పాస్ పోర్టును అతను చైనాకు తీసుకెళ్లాడు. అయితే స్పానిష్ పాస్ పోర్టుకు వీసా ఫ్రీ ఎంట్రీ లేదు.
తైవాన్ లోనే స్పానిష్ పాస్ పోర్టుతో వీసా ఫ్రీ ఎంట్రీ లభిస్తుంది. అయితే తైవాన్ కూడా చైనాలో భాగమని మెస్సీ భావించనట్టు తెలుస్తోంది. అందుకే అతను వీసాకు అప్లై చేసుకోలేదని సంబంధింత వర్గాలు వెల్లడించాయి.
అధికారులు వెంటనే మెస్సీకి ఎక్స్‌పిడైటెడ్ వీసాను మంజూరు చేసినట్లు సమాచారం. 20 నిమిషాల తర్వాత ఫుట్ బాల్ ప్లేయర్ ను ఎయిర్ పోర్ట్ బయటకు పంపించినట్లు చైనా మీడియా స్పష్టం చేసింది.