Year Ender 2024: 2025 మెగా వేలంలో అత్యధిక మొత్తాన్ని పొందిన టాప్ 5 ఆటగాళ్ల జాబితా
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) మెగా వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఆటగాళ్ల మిలియన్ల కొద్దీ ఖర్చు చేశాయి. ఈ వేలంలో రూ.27 కోట్లకు రిషబ్ పంత్‌ను లక్నో సూపర్‌జెయింట్ కొనుగోలు చేయడంతో పంత్ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఐదుగురి ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
రిషబ్ పంత్
లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ని రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ RTM కార్డ్ ద్వారా 23.5 కోట్లు ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, LSG బిడ్‌ను రూ.27 కోట్లకు పెంచడంతో డీల్‌కు ఆమోదం తెలిపింది. శ్రేయాస్ అయ్యర్ శ్రేయాస్ అయ్యర్ ని పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. 2024 వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్ల రికార్డును అయ్యర్ బద్దలు కొట్టాడు.
వెంకటేష్ అయ్యర్
కోల్‌కతా నైట్ రైడర్స్ మెగా వేలంలో ఐపిఎల్ స్టార్ వెంకటేష్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది . వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గట్టి పోటిచ్చినా, కేకేఆర్ మాత్రం అతన్ని వదులుకోలేదు. అతను ఐపీఎల్ సీజన్‌కి కేకేఆర్ తరుఫున వెంకటేష్ అయ్యర్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. అర్ష్‌దీప్ సింగ్, చాహల్ ఇక భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌లను కొనుగోలు చేయడం ద్వారా పంజాబ్ కింగ్స్ (PPKS) తమ జట్టును బలోపేతం చేసింది. ఇద్దరు స్టార్ ప్లేయర్ కోసం ఒక్కొక్కరికి రూ. 18 కోట్లు వెచ్చించారు. గత కొన్ని సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు.