Loading...
Lovlina Borgohain: బాక్సింగ్‌లో లవ్లీనా బంగారు పంచ్.. పతకాల పట్టికలో భారత్‌ @ 6!
బాక్సింగ్‌లో లవ్లీనా బంగారు పంచ్.. పతకాల పట్టికలో భారత్‌ @ 6!

Lovlina Borgohain: బాక్సింగ్‌లో లవ్లీనా బంగారు పంచ్.. పతకాల పట్టికలో భారత్‌ @ 6!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్‌ దూసుకెళ్తోంది. తాజాగా బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్ (Lovlina Borgohain) స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో బాక్సింగ్‌ విభాగంలో భారత్‌కు లభించిన స్వర్ణ పతకాల్లో ఇది కేవలం రెండోది కావడం విశేషం. మరోవైపు మహిళల సెయిలింగ్‌లో నేత్రా కుమానన్‌ కాంస్య పతకంతో మెరిసింది. దీంతో ప్రస్తుతం భారత్‌ మొత్తం 70 పతకాలతో ఆరో స్థానానికి ఎగబాకింది. వీటిలో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలు ఉన్నాయి.

వివరాలు

ఏకగ్రీవంగా లవ్లీనా విజయం..

బాక్సింగ్‌లోని 75 కేజీల విభాగంలో చైనాకు చెందిన బావో జియిపై లవ్లీనా బోర్గోహైన్‌ తొలి నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా పంచ్‌లు విసురుతూ, ప్రత్యర్థి దాడుల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ అదరగొట్టింది.

వరుసగా రెండు రౌండ్లలోనే చైనా బాక్సర్‌పై పైచేయి సాధించిన లవ్లీనా.. 2-0 తేడాతో విజయం సాధించి గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది.

ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం, రజతం రెండింటినీ అందించిన తొలి బాక్సర్‌గా లవ్లీనా బోర్గోహైన్‌ నిలిచింది. 2022లో జరిగిన ఆసియా క్రీడల్లో ఆమె రజత పతకం సాధించింది.

అంతకుముందు భారత స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ 2014 ఎడిషన్‌లో స్వర్ణ పతకం గెలిచారు. 2010లో జరిగిన ఆసియా క్రీడల్లో ఆమె కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.

వివరాలు

సెయిలింగ్‌లో భారత్‌కు కాంస్యాలు..

మహిళల స్కిఫ్‌ టీమ్‌ విభాగంలో సెయిలింగ్‌లో భారత్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఈ ఈవెంట్‌లో నిన్న జరిగిన పోటీలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

అయితే చైనాపై అనర్హత వేటు పడటంతో భారత్‌ మూడో స్థానానికి ఎగబాకింది. దీంతో హర్షిత-షీతల్ జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

ఇక మహిళల డింగే సెయిలింగ్‌ వ్యక్తిగత విభాగంలోనూ భారత్‌కు పతకం దక్కింది.

ఈ విభాగంలో నేత్రా కుమానన్‌ కాంస్య పతకాన్ని సాధించి భారత్‌ పతకాల ఖాతాలో మరో మెడల్‌ను చేర్చింది.

ADVERTISEMENT

వివరాలు

ఫైనల్‌కు దూసుకెళ్లిన సుజీత్‌..

రెజ్లింగ్‌లో భారత క్రీడాకారుడు సుజీత్‌ (Sujeet) ఫైనల్‌లో అడుగుపెట్టాడు. 65 కేజీల విభాగంలో జపాన్‌కు చెందిన కొటారో కియోకాపై సుజీత్‌ అద్భుత విజయం సాధించాడు.

మ్యాచ్‌ తొలి రౌండ్‌లో కొటారో 2-0 ఆధిక్యంతో ముందంజలోకి వెళ్లాడు. అయితే రెండో రౌండ్‌లో సుజీత్‌ పుంజుకుని 4-2తో ఆధిక్యం సాధించాడు.

అనంతరం టెక్నికల్‌గా నాలుగు పాయింట్లను 3కి తగ్గించారు. దీంతో రెండో రౌండ్‌ 3-3తో సమంగా ముగిసింది.

అయితే సుజీత్‌ సాధించిన బిగ్‌ స్కోరింగ్‌ మూవ్‌ కీలకంగా మారింది. దీంతో అతడినే విజేతగా ప్రకటించిన రిఫరీలు.. ఫైనల్‌కు చేరుకున్నట్లు వెల్లడించారు.

ADVERTISEMENT