Mayank Yadav: లక్నో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ పేసర్
ఈ వార్తాకథనం ఏంటి
లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గుడ్ న్యూస్ వచ్చింది. స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ పూర్తి ఫిట్‌గా మారి మళ్లీ జట్టులోకి రావడానికి సిద్ధమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉన్నట్టు జట్టు డైరెక్టర్ టామ్ మూడీ వెల్లడించారు. ఆర్సీబీ మ్యాచ్‌కు ముందు మాట్లాడిన టామ్ మూడీ, మయాంక్ ఇప్పుడు మ్యాచ్‌కు పూర్తిగా రెడీగా ఉన్నాడని తెలిపారు. "మయాంక్ విషయంలో చెప్పాలంటే, అతను ఇప్పుడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. టోర్నమెంట్ ప్రారంభంలోనే అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికి అతను పూర్తిగా రెడీ కాలేదు. బౌలింగ్‌లో అవసరమైన లోడ్స్, ఫిట్‌నెస్ ఇంకా కొంచెం తక్కువగా ఉండేది," అని చెప్పారు.
వివరాలు
మరో ప్లేయర్ కూడా రెడీ..
అలాగే మయాంక్‌తో పాటు మరో పేసర్ మోహ్సిన్ ఖాన్‌ను కూడా దీర్ఘకాల గాయాల నుంచి తిరిగి తీసుకురావడంలో జట్టు మెడికల్ టీమ్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. గత ఐపీఎల్ సీజన్‌లో మయాంక్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయింది. అతను కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మే 4న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా మైదానంలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో 60 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. సాధారణంగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేసే మయాంక్, ఆ మ్యాచ్‌లో మాత్రం 135-140 కిలోమీటర్ల మధ్యే బౌలింగ్ చేశాడు. ఎక్కువగా కట్టర్లు వేయడం కూడా గమనార్హం.
వివరాలు
ఆ బాధ్యత తీసుకున్న షమీ..
2024లో ఐపీఎల్‌లో డెబ్యూ చేసిన తర్వాత గాయాల కారణంగా మయాంక్ ఇప్పటివరకు కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. మొత్తం తొమ్మిది వికెట్లు తీసుకుని, సగటు 20.55గా నమోదైంది. అయితే మయాంక్ ఒక ప్రత్యేక రికార్డ్ కూడా సాధించాడు. తన తొలి రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 156.7 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి, ఐపీఎల్ 2024లో వేగవంతమైన డెలివరీగా గుర్తింపు పొందాడు. మయాంక్, మోహ్సిన్ గైర్హాజరీలో ఈ సీజన్‌లో లక్నో బౌలింగ్ బాధ్యతలను సీనియర్ పేసర్ షమీ తీసుకున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసి తన అనుభవాన్ని చూపిస్తున్నాడు.