LSG vs MI: 178పరుగుల లక్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోయిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ లో ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. లక్నో లోని అటల్ బీహారీ వాజ్ పేయి మైదానంలో జరిగిన ఈ మ్యాచులో 5పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై లక్నో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో, 20ఓవర్లు పూర్తయ్యేసరికి 3వికెట్లు నష్టపోయి 177పరుగులు చేసింది. మార్కో స్టాయినిస్ (89పరుగులు, 48బంతుల్లో 4ఫోర్లు, 8సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ తో లక్నో స్కోరును పరుగులు పెట్టించాడు. కృనాల్ పాండ్యా 49పరుగులు (42బంతుల్లో 2ఫోర్, 1సిక్సర్) చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఇక ముంబై బౌలర్లలో బెహ్రెన్ డార్ఫ్ 2వికెట్లు, పీయూష్ చావ్లా ఒక వికెట్ తీసుకున్నారు.
చివరి బంతి వరకూ పోరాడిన టిమ్ డేవిడ్
178పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు, 20ఓవర్లు ముగిసేసరికి 5వికెట్లు నష్టపోయి 172పరుగులు చేసి, విజయానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభం నుండి దూకుడుగా ఆడిన ముంబై జట్టు, 90పరుగుల వద్ద రోహిత్ శర్మ(37పరుగులు, 25బంతుల్లో 1ఫోరు, 3సిక్సర్లు) రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 103పరుగుల వద్ద ఇషాన్ కిషన్(59 పరుగులు, 39బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సర్) రూపంలో మరో వికెట్ కోల్పోయింది. మిగతా బ్యాటర్లలో టిమ్ డేవిడ్(32పరుగులు, 19బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) ఒక్కడే నిలకడగా ఆడి చివరి వరకూ క్రీజులో నిల్చున్నాడు. ముంబై బౌలర్లలో మోహ్సీన్ ఖాన్ 1వికెట్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.