Page Loader
MI vs LSG: ముంబై చేతిలో లక్నో చిత్తు.. 54 పరుగుల తేడాతో విజయం
ముంబై చేతిలో లక్నో చిత్తు.. 54 పరుగుల తేడాతో విజయం

MI vs LSG: ముంబై చేతిలో లక్నో చిత్తు.. 54 పరుగుల తేడాతో విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2025
07:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన లక్నో జట్టు 161 పరుగులకే ఆలౌట్ కావడంతో ముంబై ఈ విజయం సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ర్యాన్ రికెల్టన్ 32 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. అతనికి తోడుగా సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 54 పరుగులతో మెరిశాడు. ఇక విల్ జాక్స్ 21 బంతుల్లో 29 పరుగులు సాధించాడు.

Details

రెండు వికెట్లతో రాణించిన మయాంక్ యాదవ్

అయితే రోహిత్ శర్మ (12), తిలక్ వర్మ (6), హార్దిక్ పాండ్యా (5), కార్బిన్ బాష్ (20) త్వరగా పెవిలియన్ చేరారు. చివర్లో నమన్ ధీర్ 11 బంతుల్లో 25 పరుగులు చేసి ముంబై స్కోరును 215 వరకు తీసుకెళ్లాడు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. అయినా ముంబయి ఇండియన్స్ చేసిన భారీ స్కోరును అడ్డుకోలేకపోయారు. టార్గెట్ చేధనలో దిగిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ప్రారంభం నుంచే ఒత్తిడిలోనూ కష్టాల్లోనూ చిక్కుకున్నారు.

Details

నాలుగు వికెట్లతో చెలరేగిన జస్పిత్ బుమ్రా

మిచెల్ మార్ష్ (34), అయ్యుష్ బడోని (35), నికోలస్ పూరన్ (27) మినహా మిగిలిన బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. ముంబై బౌలింగ్ యూనిట్ ప్రత్యర్థిని గట్టిగా కట్టడి చేసింది. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు, జస్పిత్ బుమ్రా 4 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కొల్లగొట్టారు. ఈ విధంగా లక్నో సూపర్ జెయింట్స్ 161 పరుగులకే ఆలౌట్ కావడంతో ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

54 పరుగుల తేడాతో విజయం