
పంజాబ్ కింగ్స్ తో తలపడేందుకు సై అంటున్న లక్నో
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 38వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.
మొహాలోని పిసిఎ స్టేడియంలో శుక్రవారం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో రెండు జట్లు ఏడు మ్యాచ్ లు ఆడి నాలుగు విజయాలను సాధించాయి.
చివరి మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడిపోయిన లక్నో ఈసారీ ఎలాగైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు ముంబైపై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
పిసిఎ స్టేడియంలో 59 మ్యాచ్ లు జరగ్గా.. ఇందులో ఛేజింగ్ జట్లు 33సార్లు గెలుపొందాయి. మొదట బ్యాటింగ్ చేసే జట్ల సగటు రన్ రేట్ 8.41గా ఉంది. ఈ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండనుంది.
Details
అరుదైన రికార్డుకు చేరువలో ధావన్
మొహాలీలో 13 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ తొమ్మిది విజయాలను సాధించింది. 2018-2021 మధ్య పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన కేఎల్ మొహాలీలో అద్భుతంగా రాణించాడు.
ఇక్కడ ఆడిన 11 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 49.77 సగటుతో 448 పరుగులు చేశాడు.ఇందులో ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి.
శిఖర్ ధావన్ 6,500 IPL పరుగులకు చేరువయ్యాడు గాయం కారణంగా చివరి మూడు మ్యాచ్ లకు దూరమైన శిఖర్ ధావన్ నేడు బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఐపీఎల్‌లో 6,500 పరుగులు పూర్తి చేయడానికి ధావన్ కి 23 పరుగులు అవసరం కానున్నాయి.
ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్ లు ఆడిన ధావన్ 146.54 స్ట్రైక్ రేట్‌తో 223 పరుగులు చేశాడు.