తండ్రి కాబోతున్న లక్నో ఫాస్ట్ బౌలర్.. ధనాధన్ లీగ్‌కు దూరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా రాణిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ కు గట్టి షాక్ తగిలింది. ఈ సీజన్ లో ఆ జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన పాస్ట్ బౌలర్ మార్క్‌వుడ్ ఐపీఎల్ కు దూరం కానున్నారు. తన భార్య వచ్చే నెల చివర్లో రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో మార్క్ వుడ్ స్వదేశానికి వెళ్లిపోనున్నాడు. అతను లేకుండానే లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లు ఆడాల్సి రావచ్చు. దీంతో ఆ జట్టుకు కష్టాలు తప్పనున్నాయి. ఎందుకంటే మార్క్ వుడ్ ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్ లు ఆడి 11 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ కీలక దశకు వచ్చింది.
బలహీన పడనున్న లక్నో బౌలింగ్
లక్నో ఫ్లే కు చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించాలి. ఇలాంటి తరుణంలో మార్క్ వుడ్ లేకపోవడంతో లక్నో బౌలింగ్ బలహీన పడే ప్రమాదం ఉంది. అనారోగ్యం కారణంగా చివరి రెండు మ్యాచ్ లకు దూరమైన మార్క్ వుడ్ స్థానంలో ఆఫ్ఘన్ సీమర్ నవీన్ ఉల్ హక్ బరిలోకి దిగాడు. లక్నో తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 28న పంజాబ్ తో తలపడనుంది. అయితే మార్క్ వుడ్కు ఇదే చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ జూన్ 1 నుంచి ఐర్లాండ్ తో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈమ్యాచ్ కోసం తాను ఐపీఎల్ ఆఖరి దశకు దూరం కావొచ్చని ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే.