అత్యంత వేగంగా ఐపీఎల్ లో అరుదైన రికార్డు ను సాధించిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టీ20ల్లో అత్యంత అరుదైన ఫీట్ ను నమోదు చేశాడు. మహమ్మద్ షమీ వేసిన మూడో ఓవర్లో చివరి బంతికి ఫోర్ కొట్టి రాహుల్ ఆ ఘనతను సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 7వేల పరుగులు పూర్తి చేసి రికార్డును సృష్టించాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన ఇండియన్ బ్యాటర్ గా రికార్డుకెక్కాడు. కేవలం 197 ఇన్నింగ్స్ లో 7వేల టీ20 పరుగులు పూర్తి చేసి సత్తా చాటాడు.
7వేల పరుగులు పూర్తి చేసిన ఏడో భారతీయుడు కేఎల్ రాహుల్
కేఎల్ టీ20ల్లో 7వేల పరుగులు పూర్తి చేసిన ఏడో భారతీయుడిగా నిలిచాడు. ఇంతకముందు విరాట్ కోహ్లీ 212, శిఖర్ ధావన్ 246, సురేష్ రైనా 251, రోహిత్ శర్మ 258 ఇన్నింగ్స్ లో 7వేల పరుగుల మార్కును చేరుకున్నారు. 188 ఇన్నింగ్స్ లో బాబార్ 7వేల పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ దిగ్గజం క్రిస్ గేల్ 192 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును సాధించి రెండో స్థానంలో ఉన్నాడు ఇక ఈ రోజు మ్యాచ్ విషయానికొస్తే గుజరాత్ టైటాన్స్ చేతిలో లక్నో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది.