IPL 2023: రసవత్త పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, లక్నో బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేశారు. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 66(50),వృద్ధిమాన్ సాహా47(37) ఫర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, స్టోయినిస్ రెండేసి వికెట్లు, మిశ్రా, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ తీశారు. 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో లక్నో తడబడింది. దింతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ పోరాటం వృథా
లక్ష్య చేధనకు దిగిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(68)కి మేయర్స్(24), కృనాల్(23) చక్కటి సహకారాన్ని అందించారు. అప్పటికి లక్నో స్కోర్ 106/2. అటు తరువాత నుండి గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. విజయానికి చివరి 36 బంతుల్లో 31 పరుగులు కావాల్సిన దశలో నికోలస్ పూరన్ (1) సిక్స్ కోసం యత్నించి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. చివరి ఓవర్‌లో ఒత్తిడికి గురైన బదోని (8), స్టాయినిస్ (0), దీపక్ హుడా (2)తో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ అవుట్ అవ్వడంతో గెలిచే మ్యాచ్‌ని చేజేతులా లక్నో టీమ్ చేజార్చుకుంది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్, మోహిత్ శర్మ రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు