
కేఎల్ రాహుల్ ఇంకా నువ్వు మారవా, నీకంటే గిల్ బెటర్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి తన ఆటతీరుతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కు రాహుల్ దూరమయ్యాడు. అయితే మళ్లీ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు జట్టులోకి వచ్చాడు.
నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పేలవ ప్రదర్శన కొనసాగించాడు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డ రాహుల్.. చివరికి స్పిన్నర్ టాడ్ మార్పీ బౌలింగ్ ఔట్ అయ్యాడు.
రాహుల్ ఆటపై టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ స్పందించాడు. రాహుల్ ఆటతీరు దారుణంగా ఉందని, అతని స్థానంలో శుభమాన్ గిల్ లేదా సర్ఫరాజ్ వంటి ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని చెప్పారు.
గిల్
యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలి
కేఎల్ రాహుల్ ప్రతిభ, సామర్థ్యం పట్ల తనకు గౌరవం ఉందని, కానీ అంతర్జాతీయ క్రికెట్ లో 46 టెస్టులు ఆడిన రాహుల్ మెరుగైన ప్రదర్శన చేయలేదని వెంకటేష్ ప్రసాద్ పేర్కొన్నారు. టెస్టులో కేఎల్ రాహుల్ కంటే సగటు శుభమాన్ గిల్ బాగా ఉందన్నారు.
శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సర్ఫరాజ్ ఎఫ్‌సి క్రికెట్‌లో సెంచరీల సెంచరీలు సాధిస్తున్నాడు. వీరిద్దరిలో ఒకరికి అవకాశం కల్పించాలని వెంకటేష్ ప్రసాద్ కోరారు.
ఈ క్రమంలో గిల్‌కు మద్దతుగా కూడా నెటిజన్లు నిలవడం విశేషం