Loading...
ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో భారీ మార్పు.. సూపర్-7కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్!
వన్డే ప్రపంచకప్‌లో భారీ మార్పు.. సూపర్-7కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్!

ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో భారీ మార్పు.. సూపర్-7కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రాబోయే ప్రపంచకప్ టోర్నీల ఫార్మాట్లలో కీలక మార్పులు చేపట్టింది. జట్ల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చడం, అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మార్పులు 2027 వన్డే ప్రపంచకప్‌, 2028 టీ20 ప్రపంచకప్‌ల నుంచి అమల్లోకి రానున్నాయి.

వివరాలు

2027 వన్డే ప్రపంచకప్‌లో సూపర్-7

2023 వన్డే ప్రపంచకప్‌లో 10 జట్లు మాత్రమే పాల్గొనగా, 2027 ఎడిషన్‌లో మొత్తం 14 జట్లు బరిలోకి దిగనున్నాయి. వీటిలో 10 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి.

మిగిలిన నాలుగు జట్లు క్వాలిఫయర్స్‌ ద్వారా టోర్నీలోకి ప్రవేశిస్తాయి. అయితే 11వ జట్టుగా అర్హత సాధించిన జట్టుకు నేరుగా గ్రూప్‌ దశలో చోటు లభిస్తుంది.

12వ, 13వ, 14వ స్థానాల్లో నిలిచిన మూడు జట్లు గ్రూప్‌ దశకు ముందు 'సూపర్ సిరీస్‌' రౌండ్‌లో పోటీపడతాయి.

ఇందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్‌ దశకు అర్హత సాధిస్తుంది. ఆ తర్వాత గ్రూప్‌ దశలో మొత్తం 12 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడతాయి.

వివరాలు

ఆతిథ్య దేశాలకు నేరుగా అవకాశం

ప్రతి గ్రూప్‌ నుంచి మూడు జట్లు, అదనంగా నాలుగో ఉత్తమ జట్టు కలిపి మొత్తం ఏడు జట్లు సూపర్-7 దశకు చేరుకుంటాయి.

అక్కడ రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో అన్ని జట్లు పరస్పరం తలపడతాయి. సూపర్-7లో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

2027 వన్డే ప్రపంచకప్‌కు సంయుక్త ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా టోర్నీకి అర్హత సాధిస్తాయి.

అయితే మరో ఆతిథ్య దేశమైన నమీబియా అసోసియేట్ సభ్య దేశం కావడంతో నేరుగా ప్రవేశం ఉండదు.

ఆ జట్టు అర్హత టోర్నీ ఆడి ప్రపంచకప్‌లో చోటు సంపాదించుకోవాల్సి ఉంటుంది.

దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు తోడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు కూడా నేరుగా ప్రపంచకప్‌కు అర్హత పొందుతాయి.

ADVERTISEMENT

వివరాలు

2028 టీ20 ప్రపంచకప్‌లో సూపర్-10

టీ20 ప్రపంచకప్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న సూపర్-8 విధానాన్ని ఐసీసీ రద్దు చేసి, దాని స్థానంలో సూపర్-10 ఫార్మాట్‌ను తీసుకురానుంది.

ఈ టోర్నీలో మొదట 20 జట్లను ఐదు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-10 దశకు చేరుకుంటాయి.

అక్కడ మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూప్‌లో ఐదేసి జట్లు పోటీపడతాయి. సూపర్-10 దశలో ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.

మిగిలిన రెండు సెమీస్ బెర్తుల కోసం ప్రతి గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్లు, ప్రత్యర్థి గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన జట్లతో ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడతాయి.

ADVERTISEMENT