Page Loader
మార్ర్కమ్ సునామీ ఇన్నింగ్స్.. సౌతాఫ్రికా ప్రపంచకప్ బెర్తు ఖరారు!

మార్ర్కమ్ సునామీ ఇన్నింగ్స్.. సౌతాఫ్రికా ప్రపంచకప్ బెర్తు ఖరారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2023
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

నెదర్లాండ్స్ తో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తేడాతో కైవసం చేసుకుంది. ఈ భారీ గెలుపుతో వన్డే ప్రపంచకప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో వన్డే ప్రపంచ కప్ బెర్త్ దాదాపు ఖామయైంది. ఈ మ్యాచ్‌లో ఐడెన్ మార్క్రమ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయాన్ని అందిచారు. కేవలం 126 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. మార్క్రమ్ తోడు డేవిడ్ మిల్లర్ 61 బంతుల్లో 91 పరుగులు చేసి విజృంభించాడు.

మార్ర్కమ్

మార్ర్కమ్ తుఫాన్ ఇన్నింగ్స్‌పై సన్‌రైజర్స్ అభిమానులు హర్షం

జోహన్సన్‌బర్గ్‌ వేదికగా ఆదివారం నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు క్వింటాన్ డికాక్(8), తెంబా బవుమా(6) నిరాశపరిచారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగిన మార్ర్కమ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన నెదర్లాండ్ 39.1 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌటైంది. ఇదిలా ఉండగా.. ఐడెన్ మార్ర్కమ్ తుఫాన్ ఇన్నింగ్స్ పై సన్ రైజర్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. మార్ర్కమ్ త్వరగా జట్టులోకి చేరి సన్ రైజర్స్ కు విజయాలను అందించాలని అభిమానులు కోరుతున్నారు.