రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్
టీమిండియాలో స్థానం కోల్పోయిన మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో కర్నాటక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 208 పరుగులు చేసి సత్తా చాటాడు. అగర్వాల్ మూడో వికెట్‌కు నికిన్ జోస్‌తో కలిసి 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. కర్నాటక 410 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం కర్నాటక 68 పరుగల అధిక్యంలో ఉంది. మయాంక్ 360 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 208 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్‌తో కలిసి 2వ వికెట్‌కు 89 పరుగులు, 3వ వికెట్‌కు నికిన్ జోస్‌తో కలిసి 151 పరుగులు చేశాడు.
ఫామ్‌లోకి వచ్చిన మయాంక్
ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో మయాంక్ మంచి ఫామ్‌తో ఉన్నాడు. వరుసగా తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 8, 73, 51, 50, 117, 14, 52*, 10, 208 పరుగులు చేశాడు. 72.87 సగటుతో 583 పరుగులు సాధించాడు. ఇందులో అరు అర్థ సెంచరీలు చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో, మయాంక్ 43 కంటే ఎక్కువ సగటుతో 6,437 పరుగులు నమోదు చేయడం గమనార్హం. టీమిండియా తరుపున 21 మ్యాచ్‌లు ఆడి, 41.83 సగటుతో 1,488 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మయాంక్ చివరిసారిగా భారత్ తరుపున 2022లో మార్చిలో శ్రీలంకతో ఆడాడు