Page Loader
మళ్లీ సెంచరీ, తగ్గేదేలా అంటున్న సర్ఫరాజ్ ఖాన్
550 పరుగుల మార్కును దాటిన సర్ఫరాజ్‌ఖాన్

మళ్లీ సెంచరీ, తగ్గేదేలా అంటున్న సర్ఫరాజ్ ఖాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2023
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్నెళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న భారత్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో త్వరలో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడంతో సర్ఫరాజ్‌ఖాన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. అయితే 2022-23 సీజన్లో మూడో సెంచరీ చేసి సత్తా చాటాడు. కేవలం 155 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఒక దశలో 66/4తో కుప్పకూలింది. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ అద్భుతంగా ఆడి పరుగుల వరద పారించాడు.

సర్ఫరాజ్ ఖాన్

డిప్రెషన్‌లోకి వెళ్లకుండా మళ్లీ ప్రయత్నిస్తా: సర్ఫరాజ్ ఖాన్

సర్ఫరాజ్ ఖాన్ 550 పరుగుల మార్కును దాటి రికార్డును క్రియేట్ చేశాడు. ఇంతకుముందు పృథ్వీషా 579 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. సర్ఫరాజ్‌ఖాన్ ఈ సీజన్లో వరసగా 28*, 162 & 15*, 75, 20, 126*, 5 పరుగులు చేశాడు. ఈసీజన్‌లో స్ట్రైక్‌రేట్ 70 కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. 2014లో ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ 37 మ్యాచ్‌లను ఆడాడు. 80కి పైగా సగటుతో ఇప్పటివరకు 3,505 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలున్నాయి. సర్ఫరాజ్ మాట్లాడుతూ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో తీవ్ర అవేదనకు గురయ్యానని. తన తండ్రితో మాట్లాడిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లకుండా.. మళ్లీ జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు