టీమిండియాకి భారీ షాక్, కీలక ఆటగాడు దూరం
టీమిండియాకి పెద్ద ఎదురుదెబ్బ ఎదురైంది. న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్‌కు కీలక ఆటగాడు దూరమయ్యాడు. వెన్నుముక గాయం కారణంగా స్టార్ మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఆ స్థానాన్ని రజత్ పాటిదార్‌తో భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అయ్యర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది 1,424 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్‌ను అధిగమించాడు. డిసెంబర్ 2017లో వన్డేల్లో అరంగేట్రం చేసిన అయ్యర్ వన్డేల్లో సంచలనం సృష్టించాడు. 39 మ్యాచ్‌లు ఆడి 48.03 సగటుతో 1,537 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధసెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి.
న్యూజిలాండ్‌పై జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే
పాటిదార్ లిస్ట్-ఎ క్రికెట్‌లో 51 మ్యాచ్ లు ఆడి 34.33 సగటుతో ఎనిమిది అర్ధ సెంచరీలు, మూడు సెంచరీలు చేశారు. ముఖ్యంగా ఐపిఎల్ శతకం బాది సత్తా చాటాడు. న్యూజిలాండ్‌పై భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (wk), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, KS భరత్ (wk), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.