నాలుగో స్థానంలో సూర్యానా.. అయ్యారా..?
2023 వన్డే ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీమిండియా ప్లేయర్ల ఎంపిక ప్రస్తుతం బీసీసీఐకి పెను సవాల్‌గా మారింది. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలో అర్ధం కాక తలలు పట్టుకుంటోంది. టీమిండియాలో నాలుగో స్థానానికి సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు. ఈ స్థానాన్ని వీరిద్దరలో ఒకరిని మాత్రం ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో ఓసారి పరిశీలిద్దాం.. 2017 డిసెంబర్లో శ్రేయస్ వన్డే అరంగేట్రం చేశాడు. 39 మ్యాచ్‌లు ఆడి 48.03 సగటుతో 1,537 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 14 అర్ధసెంచరీలు, రెండు సెంచరీలున్నాయి.
వన్డే ప్రపంచ కప్‌లో ఎవరికి చోటు దక్కేనో..
2021 జూలైలో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ 16 వన్డేలను ఆడాడు. 32 సగటుతో కేవలం 384 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు చేశాడు. వన్డేలో సూర్యకుమార్ యాదవ్ అశించిన మేర రాణించలేదు. కేవలం టీ20ల్లో పెను సంచలనం సృష్టిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. వన్డేలపై పూర్తి దృష్టిసారిస్తే మాత్రం టీమిండియా ఖచ్చితంగా సూర్యకుమార్ వైపే మెగ్గు చూపే అవకాశం ఉంటుంది. అయితే వన్డేలో సూర్యకుమార్ యాదవ్‌కి అశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని చెప్పొచ్చు. వన్డేల్లో శ్రేయర్ అయ్యర్ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. మొదట్లో వికెట్లు పడినప్పుడు ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఈసారి వన్డే ప్రపంచ కప్‌లో ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి.