Loading...
Lionel Messi: అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ ఆడిన మెస్సీ.. కన్నీటిపర్యంతమైన దిగ్గజం
అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ ఆడిన మెస్సీ.. కన్నీటిపర్యంతమైన దిగ్గజం

Lionel Messi: అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ ఆడిన మెస్సీ.. కన్నీటిపర్యంతమైన దిగ్గజం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన దేశం తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడు. బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎస్టాడియో మోనుమెంటల్ స్టేడియంలో వేలాది మంది అభిమానుల సమక్షంలో అర్జెంటీనా, బెనిన్ జట్లు తలపడ్డాయి. తన వీడ్కోలు మ్యాచ్‌ను మెస్సీ ఘనంగా ముగించాడు. ఓ గోల్ చేయడంతో పాటు రెండు కీలక అసిస్ట్‌లు అందించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

వివరాలు 

మెస్సీ మెరుపులు.. బెనిన్‌పై అర్జెంటీనా ఘన విజయం

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో బెనిన్‌ను ఓడించింది.తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో స్కోరు 0-0గా నిలిచింది.

రెండో సగం ప్రారంభమైన తర్వాత 52వనిమిషంలో మెస్సీ అందించిన పాస్‌ను ఒటమెండీ సద్వినియోగం చేసుకున్నాడు.

ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆట 61వనిమిషంలో మెస్సీ మరోసారి తన ప్రతిభను చూపించాడు.అతడు అందించిన రెండో కీలక పాస్‌ను అందుకున్న నికో పాజ్ వేగంగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.

దీంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కుచేరింది.రెండు కీలక అసిస్ట్‌లతో జట్టు గోల్స్‌లో భాగస్వామైన మెస్సీ.. ఆ తర్వాత తానే గోల్ చేసి అభిమానులను మరింత అలరించాడు.

నిర్ణీత సమయం ముగిసే సరికి అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది.

వివరాలు 

మెస్సీ కన్నీటిపర్యంతం..

మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 21 ఏళ్లుగా అర్జెంటీనా జట్టుతో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చాడు.

మైదానంలో మెస్సీని చూసిన అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.

ఆ తర్వాత మెస్సీ మైదానం మొత్తం కలియతిరుగుతుండగా.. స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున 'మెస్సీ.. మెస్సీ' అంటూ నినాదాలు చేశారు.

వారి నినాదాలతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. తమ అభిమాన ఆటగాడికి అభిమానులు ఘనమైన వీడ్కోలు పలికారు.

ADVERTISEMENT

వివరాలు 

21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్..

లియోనల్ మెస్సీ 2005లో ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు.

అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున 208 మ్యాచ్‌లు ఆడి 126 గోల్స్ చేశాడు.

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ రెండో స్థానంలో ఉన్నాడు.

పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 146 గోల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ADVERTISEMENT

వివరాలు 

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మెస్సీ రికార్డులు

126: అర్జెంటీనా తరఫున మెస్సీ చేసిన గోల్స్. జాతీయ జట్టు తరఫున అతడు 208 మ్యాచ్‌లు ఆడాడు.

21: మెస్సీ తాను ఆడిన ఆరు ప్రపంచకప్‌లలో కలిపి చేసిన గోల్స్ సంఖ్య.

2: మెస్సీ గెలుచుకున్న 'గోల్డెన్ బాల్' అవార్డులు. 2014, 2022 ప్రపంచకప్‌లలో అతడు టోర్నీలో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు.

1: ఒకే ప్రపంచకప్‌లో గ్రూప్ దశ, ప్రిక్వార్టర్‌ఫైనల్, క్వార్టర్‌ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు.

ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (34) ఆడిన ఆటగాడి రికార్డు కూడా అతడి పేరిటే ఉంది.

అలాగే అత్యధిక మ్యాచ్‌ల్లో (27) కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను కూడా మెస్సీ సొంతం చేసుకున్నాడు.

వివరాలు 

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మెస్సీ రికార్డులు

అర్జెంటీనాకు 2022 ఫిఫా ప్రపంచకప్‌తో పాటు 2021, 2024 కోపా అమెరికా టైటిళ్లను మెస్సీ అందించాడు. 2014లో ఒకసారి, 2026లో మరోసారి అర్జెంటీనాను రన్నరప్‌గా నిలిపాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చివరి మ్యాచ్‌లో గోల్‌తో మెరిసిన మెస్సీ.. అభిమానుల మధ్య భావోద్వేగ వీడ్కోలు

ADVERTISEMENT