MI vs KKR Awards List: ముంబై ఇండియన్స్ రికార్డ్ చేజ్.. అభిమానుల్లో సంబరాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 13 ఏళ్ల ఓటమి సిరీస్‌కు ముగింపు పలికింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. రహానే (40 బంతుల్లో 67), రఘువంశీ (29 బంతుల్లో 51) మంచి ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీసి కట్టడి చేశాడు.
వివరాలు
అద్భుత రికార్డ్..
లక్ష్యాన్ని ఛేదించడంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ అద్భుతంగా ఆడారు. ఇద్దరూ కలిసి 148 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ 38 బంతుల్లో 78 పరుగులు చేసి మెరిశాడు. తరువాత తిలక్ వర్మ, కెప్టెన్ హార్థిక్ పాండ్యా మంచి ఇన్నింగ్స్‌లతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. చివర్లో నమన్ దీర్ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ముంబై కల సాకారమైంది. ముంబై అద్భుత రికార్డును నెలకొల్పింది. దీంతో ముంబై ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
వివరాలు
అవార్డు విజేతలు వీరే..
సియెర్రా సూపర్ స్ట్రైకర్: ఫిన్ అలెన్ (కేకేఆర్) - స్ట్రైక్ రేట్ 217.65 ఏంజెల్ వన్ సూపర్ సిక్సెస్: రయన్ రికెల్టన్ (ఎంఐ) - 8 సిక్సులు రూపే మోస్ట్ ఫోర్స్: రోహిత్ శర్మ (ఎంఐ) - 6 ఫోర్లు గ్రీన్ డాట్ బాల్: కార్తిక్ త్యాగి (కేకేఆర్) - 9 డాట్ బాల్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: శార్దుల్ ఠాకూర్ (ఎంఐ) - 3 వికెట్లు ముంబై వాంఖడే స్టేడియంలో కేకేఆర్‌పై 11వ విజయం సాధించింది. మొత్తం 36 మ్యాచ్‌లలో కేకేఆర్‌పై 25 విజయాలు నమోదు చేసింది. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో 14 ఏళ్ల తర్వాత ఎంఐ గెలుపు సాధించింది. వాంఖడేలో ఇదే ముంబైకి అత్యధిక విజయవంతమైన చేజ్‌గా నిలిచింది.