Loading...
R Madhavan son: తృటిలో ఫైనల్‌ ఛాన్స్‌ మిస్‌.. మాధవన్‌ కుమారుడి టీమ్‌కు నిరాశ!
తృటిలో ఫైనల్‌ ఛాన్స్‌ మిస్‌.. మాధవన్‌ కుమారుడి టీమ్‌కు నిరాశ!

R Madhavan son: తృటిలో ఫైనల్‌ ఛాన్స్‌ మిస్‌.. మాధవన్‌ కుమారుడి టీమ్‌కు నిరాశ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2026
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్‌ (R Madhavan) కుమారుడు వేదాంత్‌ మాధవన్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లోనూ వేదాంత్‌ బరిలోకి దిగాడు. అయితే 4x200 మీటర్ల ఫ్రీస్టైల్‌ రిలేలో వేదాంత్‌, అతడి బృందం తృటిలో ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. 4x200 మీటర్ల ఫ్రీస్టైల్‌ రిలే అర్హత రౌండ్‌లో భారత బృందం 9వ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం రేసును 7:24.32 నిమిషాల్లో పూర్తి చేసింది. అయితే ఫైనల్‌కు అర్హత సాధించడానికి అవసరమైన స్థానం కంటే కేవలం 0.2 సెకన్ల స్వల్ప తేడాతో వెనుకబడటంతో భారత బృందానికి ఫైనల్‌ బెర్త్‌ దక్కలేదు.

వివరాలు

కొడుకు పోస్ట్‌ను రీషేర్‌ చేసిన మాధవన్

ఫైనల్‌కు చేరుకోలేకపోయిన విషయంపై వేదాంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌ను ఆర్. మాధవన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రీషేర్‌ చేశారు.

అందులో కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా ఫోల్డెడ్‌ హ్యాండ్స్‌ ఎమోజీని కూడా జోడించారు. వేదాంత్‌ మాధవన్‌ ఆసియా క్రీడల్లో మరో రెండు ఈవెంట్లలోనూ పాల్గొననున్నాడు.

సెప్టెంబరు 23న 200 మీటర్ల ఫ్రీస్టైల్‌, సెప్టెంబరు 25న 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్లలో అతడు పోటీ పడనున్నాడు. దీంతో ఈ రెండు ఈవెంట్లపై ఆసక్తి నెలకొంది.

వివరాలు

అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ఎన్నో పతకాలు

వేదాంత్‌ మాధవన్‌ ఫ్రీస్టైల్‌ స్విమ్మర్‌గా అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు పతకాలు సాధించాడు. మలేషియన్‌ ఓపెన్‌లో ఐదు స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు.

అలాగే డానిష్‌ ఓపెన్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం సొంతం చేసుకున్నాడు.

అదే విధంగా లాత్వియన్‌ ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీల్లో కాంస్య పతకాలు సాధించాడు. ఇక కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌లో ఐదో స్థానంలో నిలిచాడు.

అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో ఇప్పటికే మంచి అనుభవం సంపాదించిన వేదాంత్‌.. ఆసియా క్రీడల్లో తన తదుపరి రెండు ఈవెంట్లలో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలి.

ADVERTISEMENT