ఆరోన్ ఫించ్ స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్
త్వరలో ధక్షిణాప్రికా పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు వెళ్లనుంది. ఆగస్టు 30న దక్షిణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచులను ఆసీస్ ఆడనుంది. ఇందుకోసం ఆస్ట్రేలియా జట్టుకు టీ20 కెప్టెన్ గా మిచెల్ మార్ష్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించాక, ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కెప్టెన్సీ పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో టెస్టులకు, వన్డేలకు కెప్టెన్‌గా పాట్ కమిన్స్, టీ20లకు సీనియర్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ని నియమిస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. మార్ష్‌కి అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ఇదొక మంచి అవకాశమని ఆసీస్ మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీ పేర్కొన్నారు.
సౌతాఫ్రికాతో తలపడే ఆస్ట్రేలియా జట్టు ఇదే
మార్ష్ 46 టీ20ల్లో 29.35 సగటుతో 1,086 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలున్నాయి. మొత్తం మీద 162 టీ20 మ్యాచ్‌లలో 31.57 సగటుతో 3,821 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో 82 వికెట్లు పడగొట్టాడు. మార్ష్ గతంలో 2014-2020 మధ్య 21 బిగ్ బాష్ లీగ్ మ్యాచుల్లో పెర్త్ స్కార్చర్స్‌కు నాయకత్వం వహించాడు. ఈ లీగ్‌లో 35 సగటుతో 560 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 జట్టు మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, ఎ. జంపా.