పాట్ కమిన్స్: వార్తలు

ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్.. పాట్ కమిన్స్ దూరం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్ తగిలింది. వ్యక్తిగత పనిమీద విదేశాలకు వెళ్లిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్ మూడో టెస్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

సిరీస్ మధ్యలో జట్టును విడిచి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చెత్తగా ఆడుతోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆశలను వదలుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది.