
IND vs AUS : భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు.. భారత్‌తో తలపడేందుకు సిద్ధం: ఆసీస్ కెప్టెన్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.
ఈ రెండు జట్ల మధ్య చైన్నై వేదికగా ఆక్టోబర్ 8న మ్యాచ్ జరగనుంది.
ఈ మెగా టోర్నీకి ముందు ఇరు జట్లు వన్డే సిరీస్‌లో తలపడ్డాయి. ఈ సిరీస్‌లో భారత్ విజేతగా నిలిచింది.
ఇరు జట్ల మధ్య జరగనున్న చైన్నై వేదిక స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని ఇప్పటికే అంచనాలు వెలువడ్డాయి.
ఈ తరుణంలో టీమిండియా స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికను రచించినట్లు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు.
గతంతో తమ బ్యాటర్లు స్పిన్ అద్భుతంగా ఎదుర్కొని పరుగులు తీశారని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
Details
అద్భుతమైన ఫామ్ లో డేవిడ్ వార్నర్, మాక్స్ వెల్
తొలి మ్యాచు కోసం ఇప్పటికే ప్రిపరేషన్‌ను పూర్తి చేశామని, టీమిండియాతో చాలా క్రికెట్‌ను ఆడిన అనుభవం తమ బ్యాటర్లకు ఉందని, భారత బౌలర్లు ఎలా వేస్తారనేదానిపై ఓ అవగాహన ఉందని కమిన్స్ పేర్కొన్నాడు.
రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో తమ జట్టు విజయం సాధించడంతో విశ్వాసం పెరిగిందని, బలమైన XIతో బరిలోకి దిగుతామని వెల్లడించారు.
డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్ వెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని, భారత్ లో ఐపీఎల్ ఆడిన అనుభవం తమకు కలిసోస్తుందని, క్లిష్టమైన పరిస్థితుల్లో విభిన్నంగా ఆలోచించడం కూడా కీలకమేనని కమిన్స్ స్పష్టం చేశారు.