LOADING...
World Cup 2023: ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ జట్టు ఇదే.. కీలక ప్లేయర్లు ఔట్!
ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ జట్టు ఇదే.. కీలక ప్లేయర్లు ఔట్!

World Cup 2023: ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ జట్టు ఇదే.. కీలక ప్లేయర్లు ఔట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2023
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో జరగనున్న వన్డే ప్రపంచ కప్ 2023 కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. స్టార్ పేసర్ పాట్ కమిన్స్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, అష్టన్ అగర్‌లతో సహా చాలామంది ఆల్ రౌండర్లతో ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. మరో స్టార్ ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్, బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్న లబుషన్ లకు మాత్రం వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు లభించలేదు. ఒకవేళ ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు గాయపడితే తమ జట్టులో మార్పులు చేసేందుకు జట్లకు ఇంకా సెప్టెంబర్ 28 వరకు గడువు ఉంది.

Details

వన్డే వరల్డ్ కప్ ఎంపికైన ఆస్ట్రేలియా జట్టు ఇదే

ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కంగారూల టీంలో జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ రూపంలో ఇద్దరు వికెట్‌ కీపర్లు ఉన్నారు. వీరిలో కారీకే జట్టులో స్థానం పొందే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ జట్టు పాట్ కమిన్స్ (సి), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా, మిచెల్ స్టార్క్.