Page Loader
WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్‌ కమిన్స్‌.. రికార్డుల మీద రికార్డులు
చరిత్ర సృష్టించిన పాట్‌ కమిన్స్‌.. రికార్డుల మీద రికార్డులు

WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్‌ కమిన్స్‌.. రికార్డుల మీద రికార్డులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
08:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (WTC) ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుతమైన ప్రదర్శనతో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా కమిన్స్ చరిత్రలో నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కమిన్స్ కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీయడం గమనార్హం. కమిన్స్ విజృంభించడంతో దక్షిణాఫ్రికా జట్టు 138 పరుగులకే కుప్పకూలిపోయింది. ముఖ్యమైన బ్యాటర్లు తెంబా బావుమా (36), బెడింగ్‌హామ్‌ (45)తో పాటు వియాన్ ముల్డర్ (6), కైల్ వెరినే (13), మార్కో యాన్సన్ (0), కగిసో రబాడ (1)లను ఔట్ చేశాడు.

వివరాలు 

ఐసీసీ ఫైనల్స్‌లో అద్భుత రికార్డులు 

ఈ అద్భుత ప్రదర్శనతో పాట్ కమిన్స్ టెస్టు క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. అంతేకాదు, ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే, ఐసీసీ ఫైనల్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్లు నమోదు చేసిన బౌలర్‌గా ఘనత అందుకున్నాడు. గతంలో ఈ ఘనత దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ పేరు మీద ఉండేది. 1998లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కలిస్ 7.3 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఆ రికార్డును పాట్ కమిన్స్ బద్దలుకొట్టాడు. అంతేకాకుండా, లార్డ్స్ మైదానంలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన కెప్టెన్‌గా కూడా కమిన్స్ కొత్త రికార్డు నెలకొల్పాడు.

వివరాలు 

మూడో స్థానంలో కమిన్స్

ఇంతకుముందు ఈ రికార్డు 1992లో భారత్‌పై ఆరు వికెట్లు (6/101) తీసిన ఇంగ్లండ్ బౌలర్ బాబ్ విల్లిస్ పేరిట ఉండేది. అంతేకాదు, టెస్టు క్రికెట్‌లో ఐదు వికెట్లు తీసిన, కమిన్స్ (9 సార్లు) మూడో స్థానంలో నిలిచాడు. అతని ముందున్న వారు రిచీ బెనాడ్ (9 సార్లు - ఆస్ట్రేలియా), ఇమ్రాన్ ఖాన్ (12 సార్లు - పాకిస్తాన్). కమిన్స్ ఈ లిస్టులో బిషన్ సింగ్ బేడీ (8 సార్లు)ను అధిగమించి మూడు సార్లు ఐదు వికెట్లు తీసిన అత్యధిక కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు.