NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / యాషెస్ సిరీస్: ఉత్కంఠ పోరులో ఆసీస్‌దే విజయం
    తదుపరి వార్తా కథనం
    యాషెస్ సిరీస్: ఉత్కంఠ పోరులో ఆసీస్‌దే విజయం
    సంబరాలు చేసుకుంటున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు

    యాషెస్ సిరీస్: ఉత్కంఠ పోరులో ఆసీస్‌దే విజయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 21, 2023
    09:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. 281 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 2 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.

    ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని చివరికి చేధించి రికార్డును సృష్టించాడు.ప్రస్తుతం ఆస్ట్రేలియా 5 టెస్టుల యాషెస్ సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యం సాదించింది.

    9వ వికెట్ కు లియాన్(16)తో కలిసి కెప్టెన్ కమిన్స్ అజేయంగా 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు.

    అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఉస్మాన్ ఖవాజా రెండో ఇన్నింగ్స్ లోనూ 68 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

    Details

    ఖావాజాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు'

    ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ 3, రాబిన్ సన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఖావాజాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' దక్కింది. కెప్టెన్ కమిన్స్ అతికష్టం మీద ఒక్కో పరుగును జోడిస్తూ, వికెట్ ను కాపాడుకుంటూ లక్ష్యం వైపు అడుగులు వేశారు.

    ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 393/8 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 386 పరుగులకు ఆలౌటైంది.

    ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 273 పరుగులు చేయగా ఆసీస్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్ధేశించింది.

    ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు లార్డ్స్ మైదానంలో జూన్ 28 నుంచి జులై 2 వరకు జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యాషెస్ సిరీస్
    పాట్ కమిన్స్

    తాజా

    Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా  పాకిస్థాన్
    Raj Nidimoru and Samantha: రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ క్లారిటీ! సమంత
    Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం జార్జియా
    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు తెలంగాణ

    యాషెస్ సిరీస్

    ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ జట్టులోకి ఇంగ్లండ్
    Ashes 2023 : ఇంగ్లండ్ గడ్డపై స్మిత్, వార్నర్ సాధించిన రికార్డులివే! ఆస్ట్రేలియా
    యాషెస్ సమరానికి సర్వం సిద్ధం.. ఎక్కువ సిరీస్‌లు గెలిచిందే వీరే..? టీమిండియా
    యాషెస్ సిరీస్ కు ఆ పదం ఎలా వచ్చిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!  ఆస్ట్రేలియా

    పాట్ కమిన్స్

    సిరీస్ మధ్యలో జట్టును విడిచి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆస్ట్రేలియా
    ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్.. పాట్ కమిన్స్ దూరం క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025