Page Loader
Virat-Cummins:"కోహ్లి,నువ్వు నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు".. కోహ్లీపై పాట్ కమిన్స్ స్లెడ్జింగ్‌
కోహ్లీపై పాట్ కమిన్స్ స్లెడ్జింగ్‌

Virat-Cummins:"కోహ్లి,నువ్వు నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు".. కోహ్లీపై పాట్ కమిన్స్ స్లెడ్జింగ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గత ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఒక్క సిరీస్‌ను మినహాయిస్తే, అతను ప్రతిసారీ ఆసీస్‌పై అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ విరాట్‌ను స్లెడ్జింగ్‌ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. అదేంటి, కమిన్స్‌ మైదానంలో కోహ్లీని ఒక్క మాట కూడా అనలేదే కదా? ఇది ఎప్పుడు జరిగిందని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సన్నివేశం ఒక యాడ్ వీడియోలో భాగం.

వివరాలు 

ఆసీస్‌కు మరో షాక్? 

ఈ యాడ్ వీడియోలో, పాట్ కమిన్స్ షేవింగ్ చేసుకుంటూ అద్దంలో చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో, "హాయ్ కోహ్లీ! నువ్వు ఇప్పటివరకు ఇలా నెమ్మదిగా ఆడటం చూడలేదు. చాలా నెమ్మదిగా ఆడావు!" అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇప్పటికే ఆసీస్‌ జట్టు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సేవలను కోల్పోయింది.ఇప్పుడు మరో భారీ షాక్ ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాలతో శ్రీలంక పర్యటనకు దూరమైన కెప్టెన్ పాట్ కమిన్స్,ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కూడా అనుమానంగా మారింది. ఆసీస్ కోచ్ మెక్‌డొనాల్డ్ ప్రకారం,కమిన్స్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఒకవేళ అతను గైర్హాజరైతే,స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశముంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..