LOADING...
Pat Cummins: వాంఖడే పిచ్‌ను మార్చేశారు.. స్పందించిన పాట్ కమిన్స్
వాంఖడే పిచ్‌ను మార్చేశారు.. స్పందించిన పాట్ కమిన్స్

Pat Cummins: వాంఖడే పిచ్‌ను మార్చేశారు.. స్పందించిన పాట్ కమిన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2023
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా మొదటి సెమీస్‌లో వాంఖడే వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఓ అంగ్ల పత్రిక బీసీసీఐపై సంచలన ఆరోపణలను చేసింది. సెమీ ఫైనల్ కోసం ముందుగా అనుకున్న పిచ్‌ను కాకుండా మరో పిచ్‌ను సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఈ మ్యాచుకు కొత్త పిచ్‌ను ఉపయోగించాలని మొదట అనుకున్నారని, ఈ మెగా టోర్నీలో రెండు మ్యాచులు ఆడిన పిచ్ పైనే మ్యాచును నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేసినట్లు ప్రచురించింది. పిచ్‌పై స్పిన్నర్లు రాణించడంతోనే ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉండేందుకు ఇలా చేసిందని ఆరోపించింది.

Details

ఐసీసీపై నమ్మకం ఉందన్న కమిన్స్

ఈ పిచ్ వివాదంపై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు. ఐసీసీపై తమకు నమ్మకం ఉందని, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ తాము ఎలాంటి సమస్యను ఎదుర్కోలేదని చెప్పాడు. ఐసీసీలో ఒక స్వతంత్ర పిచ్ క్యూరేటర్ ఉంటారని, అతడు రెండు జట్లకు న్యాయం జరిగేలా చూసుకుంటారని కమిన్స్ వెల్లడించాడు. ఇదిలా ఉండగా, రెండో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం ఈ మ్యాచ్ జరగనుంది.