Page Loader
Pat Cummins vs Pant: రిషభ్ పంత్ అత్యంత డేంజర్‌.. మాకో ప్లాన్ ఉంది: ప్యాట్ కమిన్స్ 
రిషభ్ పంత్ అత్యంత డేంజర్‌.. మాకో ప్లాన్ ఉంది: ప్యాట్ కమిన్స్

Pat Cummins vs Pant: రిషభ్ పంత్ అత్యంత డేంజర్‌.. మాకో ప్లాన్ ఉంది: ప్యాట్ కమిన్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2024
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, భారత్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌ కోసం తాము సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఓ ఇంగ్లిష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (BGT 2024) కోసం టీమిండియాకు హ్యాట్రిక్‌ కొట్టనీయకుండా అడ్డుకుంటామని చెప్పారు. రోహిత్, విరాట్, రిషభ్ పంత్, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న భారత్‌ను అడ్డుకోవడం చాలా కఠినమైన సవాలే అని ఆయన అన్నారు. షమీ గాయం కారణంగా పర్యటక జట్టుకు నష్టం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

డేవిడ్ వార్నర్‌ స్థానంలో ఎవరు?

"బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం మా సన్నద్ధత చాలా బాగుంది.గతం కంటే మెరుగైన ప్రదర్శన అందిస్తాం. ఈసారి ఎలాగైనా ట్రోఫీని దక్కించుకోవాలని ఆశిస్తున్నాం.మా సొంత ప్రదేశంలో ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమైన అనుభవం.గత రెండు సార్లు భారత్‌ జయించిన విషయం పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి సిరీస్‌ మరింత ఆసక్తికరంగా మారింది. మా జట్టులో కొన్ని స్థానాలను గురించి చర్చలు జరుగుతున్నాయి.డేవిడ్ వార్నర్‌ స్థానంలో ఎవరు వస్తారో అన్నది ఇప్పుడు ప్రధాన విషయం. అయితే, ఆటగాళ్ల విషయంలో మాకు స్పష్టత ఉంది. కామెరూన్ గ్రీన్ లేకపోవడం మాకు ఒక ఇబ్బంది. అలాగే, మహ్మద్ షమీ గాయం కారణంగా దూరం కావడం భారత్‌కు లోటు. కానీ క్రికెట్‌లో ఇలాంటివి సర్వసాధారణమే. తప్పకుండా మరో ఆటగాడు రెడీగా ఉంటుంది.

వివరాలు 

పంత్‌ను అడ్డుకోవడానికి ప్రణాళికలు

రోహిత్, విరాట్ వంటి బ్యాటర్లు ప్రస్తుతం ఫామ్‌లో లేరు. కానీ వారిని తక్కువగా అంచనా వేయకూడదు. భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై మా దృష్టి కేంద్రీకృతమై ఉంది. రిషభ్ పంత్ గురించి ఇప్పటికే నేను చెప్పుకున్నట్లుగా, అతను చాలా ప్రమాదకరమైన ఆటగాడు.ఆసీస్‌పై అతను అద్భుతంగా ఆడతాడు. ఈ సారి పంత్‌ను అడ్డుకోవడానికి మాకు మంచి ప్రణాళికలు ఉన్నాయి. భారత ఆటగాళ్లు పేస్ పిచ్‌లపై బాగా ఆడుతున్నారు. పెర్త్, అడిలైడ్ పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. అయితే, ఈ సారి వారికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని భావిస్తున్నాం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవాలని ప్రస్తుతం మా దృష్టి లేదు. ఒక్కో మ్యాచ్‌ను గెలిచి ముందుకు సాగిపోతాం" అని కమిన్స్‌ అన్నారు.