LOADING...
IND vs AUS: భారత్ సిరీస్‌కి పాట్ కమ్మిన్స్ దూరం.. రోహిత్, సూర్యలకు గుడ్ న్యూస్
భారత్ సిరీస్‌కి పాట్ కమ్మిన్స్ దూరం.. రోహిత్, సూర్యలకు గుడ్ న్యూస్

IND vs AUS: భారత్ సిరీస్‌కి పాట్ కమ్మిన్స్ దూరం.. రోహిత్, సూర్యలకు గుడ్ న్యూస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్టోబర్ 19 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రెండు జట్లు మూడు వన్డేలు ఆడతాయి. వన్డే సిరీస్ పూర్తైన తర్వాత, టీమ్స్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతాయి. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ రెండు సిరీస్‌లకు అందుబాటులో ఉండరు. కమ్మిన్స్ తుంటి నొప్పితో బాధపడుతున్నందున వైద్యులు అతనికి అదనపు విశ్రాంతి అవసరమని సూచించారు. ఇది కారణంగా అతను ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అలాగే, భారత్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లలో కూడా అతను పాల్గొనలేడు. కమ్మిన్స్ సిరీస్‌లో పాల్గొనలేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు నాయకత్వం మిచెల్ మార్ష్‌కు ఇచ్చే అవకాశం ఉంది.

Details

రెండు నెలల పాటు  కమిన్స్ దూరం

కమిన్స్ పూర్తిగా కోలుకుని నవంబర్‌లోని యాషెస్ సిరీస్‌కి మాత్రమే సిద్ధమవుతారని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ నవంబర్ 21న ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వైద్యులు కమిన్స్ గాయాన్ని పర్యవేక్షిస్తుండటంతో, అతను రాబోయే రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉంటాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఆస్ట్రేలియా టీ20 జట్టులో మిచెల్ మార్ష్ (కెప్టెన్), షాన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఉన్నారు.