Pat Cummins : విరాట్ కోహ్లీ ఔట్ అయినప్పుడు స్టేడియం సైలెంట్ కావడం చాలా సంతృప్తినిచ్చింది : పాట్ కమిన్స్
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో టీమిండియా ఓటమి భారత అభిమానులకు షాక్‌కు గురి చేసింది. భారత ప్లేయర్లు ఓటమిని జీర్ణించుకోలేక గ్రౌండ్ లోనే కన్నీటీ పర్యంతమయ్యారు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముఖాల్లో దు:ఖం కొట్టిచ్చినట్లు కన్పించింది. మ్యాచును ప్రత్యేక్షంగా వీక్షించిన లక్షమంది ప్రేక్షకుల ముఖాల్లోనూ బాధ కనిపించింది. మ్యాచ్ కి ఒక్కరోజు శనివారం మీడియా సమావేశంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నిజమయ్యాయి. ఆదివారం స్టేడియంలో క్రౌడ్ అంతా వన్ సైడెడ్ ఉంటుందని, భారత దేశానికి మద్దతుగా అభిమానులు చేసే అరుపులను నిశ్శబ్దంలోకి నెట్టగలిగితే దానంత ఆనందం మరోటి ఉండదని కమిన్స్ చెప్పాడు.
డేరింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిన పాట్ కమిన్స్
ఆసీస్ బౌలర్ల ధాటికి ఆరంభంలోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. అయితే విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు భారత అభిమానులు ధైర్యంగానే ఉన్నారు. అయితే 29 ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. ఇక కోహ్లీ అవుటవడంతో కమిన్స్ చెప్పినట్లుగానే పరిస్థితి మొత్తం మారిపోయింది. స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఈ ఘటనను సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. 1.3లక్షల మంది ప్రేక్షకులను సైలెంట్ చేయడం చాలా సంతృప్తినిచ్చిందని అంటూ పాట్ కమిన్స్ డేరింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.