Page Loader
WTC Final 2025:లార్డ్స్‌లో అరుదైన ఘనత సాధించిన పాట్ కమిన్స్‌.. 50ఏళ్లలో ఈ ఫీట్ అందుకున్న ఏకైక ఆసీస్ కెప్టెన్‌ 
50ఏళ్ల ఈ ఫీట్ అందుకున్న ఏకైక ఆసీస్ కెప్టెన్‌

WTC Final 2025:లార్డ్స్‌లో అరుదైన ఘనత సాధించిన పాట్ కమిన్స్‌.. 50ఏళ్లలో ఈ ఫీట్ అందుకున్న ఏకైక ఆసీస్ కెప్టెన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
07:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన రికార్డుతో క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్‌ల సందర్భంలో ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ను ఔట్ చేసి ఆసీస్ కెప్టెన్ల ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ (WTC) 2023-25 ఫైనల్‌లో కమిన్స్ ఈ అసాధారణ ఘనతను అందుకున్నాడు. సఫారీ కెప్టెన్ టెంబా బవుమాను ఔట్ చేయడం ద్వారా కమిన్స్ ఈ ప్రత్యేకతను సాధించాడు. ఆయన ముందు ఈ ఘనతను అందుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్లు కేవలం ఇద్దరే - మాంటీ నోబుల్, ఇయాన్ చాపెల్.

వివరాలు 

లార్డ్స్‌లో జరిగిన టెస్ట్‌లలో ప్రత్యర్థి కెప్టెన్‌ను ఔట్ చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్లు వీరే.. 

మాంటీ నోబుల్ - 1909లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఆర్చీ మాక్‌లారెన్‌ను ఇన్నింగ్స్‌లలో రెండుసార్లు ఔట్ చేశాడు. ఇయాన్ చాపెల్ - 1975లో టోనీ గ్రెగ్‌ను ఔట్ చేశాడు. పాట్ కమిన్స్ - 2025లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బవుమా 84 బంతులు ఆడి 4 బౌండరీలు, 1 సిక్స్‌తో కలిపి 36 పరుగులు చేశాడు. పాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో మార్న‌స్ లబుషేన్ చక్క‌టి క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

వివరాలు 

91 పరుగుల వెనుకబడిన సఫారీ జట్టు

రెండో రోజు లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు 5 వికెట్ల నష్టంతో నిలిచింది. కైల్ వెర్రెయిన్ (11), డేవిడ్ బెడింగ్‌హామ్ (39)లు క్రీజులో ఉన్నారు. ఇప్పటికీ సఫారీ జట్టు ఆసీస్ స్కోరు కంటే 91 పరుగుల వెనుకబడి ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.