Loading...
Mohammad Amir: ఐపీఎల్ ఎంట్రీపై మహమ్మద్ అమీర్ క్లారిటీ.. రూమర్లకు చెక్ పెట్టిన పాక్ మాజీ పేసర్!
ఐపీఎల్ ఎంట్రీపై మహమ్మద్ అమీర్ క్లారిటీ.. రూమర్లకు చెక్ పెట్టిన పాక్ మాజీ పేసర్!

Mohammad Amir: ఐపీఎల్ ఎంట్రీపై మహమ్మద్ అమీర్ క్లారిటీ.. రూమర్లకు చెక్ పెట్టిన పాక్ మాజీ పేసర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఐపీఎల్‌లో ఆడబోతున్నాడంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను అమీర్ ఖండించాడు. ఐపీఎల్‌లో ఆడబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. బ్రిటిష్ పౌరసత్వం పొందిన అమీర్.. ఆ హోదాలో ఆఫ్ఘనిస్థాన్ ప్రీమియర్ లీగ్‌కు రిజిస్టర్ చేసుకోవడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ ప్రచారంపై అతడు స్పందించడంతో దీనికి తెరపడింది. ఈ విషయంపై మహమ్మద్ అమీర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడు. "అందరికీ నమస్కారం. ఐపీఎల్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేయాలనుకుంటున్నానని తన పోస్టులో పేర్కొన్నాడు. దీంతో అమీర్ ఐపీఎల్‌లో ఆడబోతున్నాడంటూ జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికాడు.

వివరాలు

అజార్ మహమూద్ తరహాలో ఐపీఎల్‌లోకి వస్తాడని అంచనా

పాకిస్థాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.

అయితే మహమ్మద్ అమీర్ బ్రిటిష్ పౌరసత్వం పొందడంతో అతడు మరో మాజీ పాకిస్థాన్ ఆల్‌రౌండర్ అజార్ మహమూద్ తరహాలో ఐపీఎల్‌లోకి అడుగుపెడతాడని చాలామంది భావించారు.

అజార్ మహమూద్ కూడా బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత 2012 నుంచి 2015 వరకు ఐపీఎల్‌లో ఆడాడు. ఈ సమయంలో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

దీంతో అమీర్ కూడా ఇదే బాటలో ఐపీఎల్‌లోకి వస్తాడని వార్తలు వెలువడ్డాయి. తాజాగా అతడి ప్రకటనతో ఈ ఊహాగానాలకు తెరపడింది.

వివరాలు

బ్రిటిష్ పౌరసత్వం.. పాకిస్థాన్ తరఫున ఆడే అధ్యాయానికి ముగింపు

ఈ ఏడాది తన భార్య నర్జిస్ ఖాన్ ద్వారా మహమ్మద్ అమీర్ బ్రిటిష్ పౌరసత్వం పొందాడు.

దీంతో ఇంగ్లండ్‌లో నిర్వహించే 'ది హండ్రెడ్' వంటి టోర్నీల్లో స్థానిక ఆటగాడిగా ఆడే అవకాశం అతడికి లభించింది.

ఈ విషయంపై గతంలోనే అమీర్ స్పందించాడు. "నేను ఇప్పుడు బ్రిటిష్ స్థానిక ఆటగాడిని. కౌంటీ ఛాంపియన్‌షిప్, ది హండ్రెడ్ వంటి టోర్నీల్లో స్థానిక ఆటగాడిగా ఆడాలంటే, మరో దేశానికి ప్రాతినిధ్యం వహించనని ఒక పత్రంపై సంతకం చేయాలి.

కాబట్టి నా పాకిస్థాన్ అధ్యాయం ముగిసిపోయిందని అమీర్ గతంలో స్పష్టం చేశాడు.

ADVERTISEMENT

వివరాలు

పాకిస్థాన్ తరఫున అమీర్ గణాంకాలు ఇవే

2024 టీ20 ప్రపంచకప్ తర్వాత మహమ్మద్ అమీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

పాకిస్థాన్ తరఫున అతడు మొత్తం 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తన తరం అత్యుత్తమ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా అమీర్ గుర్తింపు పొందాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఫ్రాంచైజీ లీగ్‌లలో అతడికి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది.

ADVERTISEMENT