Loading...
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నావ్: మహమ్మద్ కైఫ్ ఫైర్
గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నావ్: మహమ్మద్ కైఫ్ ఫైర్

Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నావ్: మహమ్మద్ కైఫ్ ఫైర్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల యువ ఆటగాళ్ల జీవితాలు, కెరీర్లు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలిచినప్పటికీ..ఈ సిరీస్‌లో జట్టు బలహీనతలు బయటపడ్డాయని, లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించారు. మూడో వన్డేలో వెస్టిండీస్ నిర్దేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కాపాడుకోలేకపోవడాన్ని కైఫ్ తప్పుబట్టారు. ముఖ్యంగా యువ బౌలర్లకు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడం జట్టు ప్రధాన సమస్యగా మారిందన్నారు. రెండో వన్డేలో అరంగేట్రం చేసిన యువ పేసర్ అకీబ్ నబీ 8.5 ఓవర్లలో 84 పరుగులు సమర్పించుకున్నాడు.

వివరాలు 

ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన..

అయితే ఒక్క మ్యాచ్‌లోనే అతడిని పక్కన పెట్టడం సరైన విధానం కాదని కైఫ్ అభిప్రాయపడ్డారు.

అకీబ్ నబీ స్థానంలో మూడో వన్డేలో బరిలోకి దిగిన అన్షుల్ కాంబోజ్ కూడా 10 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఆటగాడిని పక్కన పెడితే అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు.

యువ బౌలర్లకు తగినంత సమయం, వరుస అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

సరైన బ్యాకప్ బౌలర్లు లేకపోవడం భవిష్యత్తులో టీమిండియాకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై అదనపు ఒత్తిడి

నితీష్ రెడ్డికి కూడా ఒక్క మ్యాచ్‌లోనే కొత్త బంతిని అప్పగించి.. ఆ తర్వాత వ్యూహాన్ని మార్చేయడం టీమ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికల్లో స్పష్టత లేకపోవడాన్ని చూపిస్తోందని కైఫ్ విమర్శించారు.

దీనికి తోడు స్లో ఓవర్ రేట్ కారణంగా చివరి ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులతో భారత్ ఇబ్బందులు ఎదుర్కొందన్నారు.

ఇలాంటి నిర్ణయాలు, పరిస్థితులు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయని తెలిపారు.

ప్రపంచకప్‌కు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో అనుభవం లేని బౌలింగ్ దళంతో గిల్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోందని కైఫ్ అన్నారు.

జట్టులో బౌలింగ్ విభాగాన్ని ఇప్పటి నుంచే పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై అదనపు ఒత్తిడి

మరోవైపు కోహ్లీ, రోహిత్, గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలు చేయడం సాధారణ విషయమేనని, వాటి వల్ల జట్టుకు కొత్తగా పెద్దగా ప్రయోజనం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

కుల్దీప్ యాదవ్‌కు గతంలో తగినన్ని అవకాశాలు ఇవ్వలేదని కూడా కైఫ్ ప్రస్తావించారు.

ఈ సిరీస్ పరిస్థితి 'ఉన్నవాడు ధనవంతుడవ్వడం.. లేనివాడు పేదవాడవ్వడం' అన్నట్లుగా మారిందని ఎద్దేవా చేశారు.

మొత్తంగా చూస్తే వెస్టిండీస్‌పై సిరీస్ విజయం సాధించినప్పటికీ.. భారత్‌కు ఈ సిరీస్ నుంచి ఒక్క సానుకూల అంశం కూడా దక్కలేదని మహమ్మద్ కైఫ్ స్పష్టం చేశారు.

ADVERTISEMENT