Page Loader
Arjun Award: 'నా జీవితంలో అతిపెద్ద విజయం': అర్జున అవార్డుపై పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు 
Arjun Award: 'నా జీవితంలో అతిపెద్ద విజయం': అర్జున అవార్డుపై పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

Arjun Award: 'నా జీవితంలో అతిపెద్ద విజయం': అర్జున అవార్డుపై పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2024
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహమ్మద్ షమీ 2023లో భారత జట్టుకు అనేక విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా, ODI ప్రపంచ కప్ 2023లో అతని అద్భుతమైన ప్రదర్శనతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభను కనపర్చిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక అర్జున పురస్కారాన్ని సాధించాడు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ గౌరవప్రదమైన గౌరవానికి షమీని నామినేట్ చేసింది.

Details 

ఇంగ్లాండ్‌ టెస్ట్ సిరీస్‌కు షమీ దూరం 

ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. "ఈ అవార్డు గెలుచుకోవాడాన్ని ఒక కలగా అభివర్ణించాడు. చాలామంది క్రీడాకారులకు ఈ అవార్డును జీవితకాలం మొత్తం గడిచిన గెలుచుకోలేరు. ఇది నాకు దక్కడం సంతోషకరమైన విషయం, నేను గర్వపడుతున్నాను. చాలా మంది వ్యక్తులు తమ జీవితాంతం ఈ అవార్డును గెలుచుకోవాలని చూసి ప్రేక్షకులుగా మిగిలిపోతారు. ఇది చాలా మందికి నెరవేరని కల, ఇది వ్యక్తపరచలేని అనుభూతి" అని షమీ వ్యాఖ్యానించాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ముగిసిన తరువాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు దూరం అయ్యాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ.. మడమ గాయం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉండట్లేదు.