Shubman Gill: మెడ నొప్పితో శుభమన్ గిల్ ఔట్: బీసీసీఐ తాజా అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శుభమన్ గిల్ (Shubman Gill).. మెడ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. సైమన్ హార్మర్ వేసిన 35వ ఓవర్‌లో అతను స్వీప్ షాట్ ఆడిన క్షణంలోనే మెడ కండరం బిగుసుకుపోవడంతో గిల్ నొప్పితో తల్లడిల్లిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించినా, నొప్పి ఎక్కువగా ఉండడంతో గిల్ బ్యాటింగ్ కొనసాగించలేకపోవడంతో మైదానాన్ని వీడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతడు తిరిగి బ్యాటింగ్ చేసేందుకు కూడా రాలేదు. మొత్తంగా ఆయన మూడే బంతులు ఎదుర్కొని పెవిలియన్‌కు చేరాడు.
వివరాలు
వర్క్‌లోడ్ వల్ల కాదు.. నిద్రలేమి వల్లే: మోర్నీ మోర్కెల్
గిల్ ఆరోగ్యం గురించి బీసీసీఐ ఒక అధికారిక అప్‌డేట్ ఇచ్చింది. ఈ మ్యాచ్ మిగతా భాగం కోసం అతడు అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది. గాయం జరిగిన వెంటనే జాగ్రత్త చర్యగా గిల్‌ను ఆసుపత్రికి తరలించారని, ఐసీయూలో ఉంచి పర్యవేక్షణ చేసినట్టు సమాచారం. ఇది వర్క్‌లోడ్ సమస్య కాదని, నిద్రలేమి కారణంగా కండరం పట్టేసిందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వివరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా గిల్ ఆడే అవకాశం లేకపోవడం టీమ్‌ఇండియాపై ప్రభావం చూపే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.