LOADING...
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో ఎక్కువసార్లు డక్ అవుట్ అయిన టాప్ క్రికెటర్లు వీరే!
టీ20 వరల్డ్ కప్‌లో ఎక్కువసార్లు డక్ అవుట్ అయిన టాప్ క్రికెటర్లు వీరే!

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో ఎక్కువసార్లు డక్ అవుట్ అయిన టాప్ క్రికెటర్లు వీరే!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ఫార్మాట్ వచ్చాక క్రికెట్ స్వరూపమే మారిపోయింది. బ్యాటర్లు మొదటి బంతి నుంచి తుపాకీలా భారీ షాట్లతో రెచ్చిపోతుంటారు. అయితే, వేగంగా ఆడడం వల్ల వికెట్లు సమర్పించుకోవడం సర్వసాధారణం. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా "డక్ అవుట్" అయిన టాప్ ఆటగాళ్లను చూద్దాం.

#1

షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్) - 5 డక్ అవుట్లు:

పాకిస్థాన్ అగ్రస్థాయి ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఈ రికార్డులో ముందుగా ఉన్నాడు. కెరీర్‌లో ఎన్నో వేగవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడినా, టీ20 ప్రపంచకప్ వేదికపై 5 సార్లు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు.#2 తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) - 5 డక్ అవుట్లు: శ్రీలంక ఓపెనర్ దిల్షాన్ కూడా అఫ్రిది తో కలిసి ఈ రికార్డును పంచుకున్నాడు. 'దిల్-స్కూప్' షాట్లతో అభిమానులను మెరిసించిన దిల్షాన్, ప్రపంచకప్ లో 5 సార్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

#3

జి.హెచ్. డాక్రెల్ (ఐర్లాండ్) - 4 డక్ అవుట్లు:

ఐర్లాండ్ ప్రతినిధి డాక్రెల్ 2010 నుంచి 2024 వరకు జరిగిన టీ20 వరల్డ్ కప్‌లలో 19 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 4 సార్లు డక్ అవుట్ కావడం విశేషం.#4 సి.ఎస్. మెక్లీడ్ (స్కాట్లాండ్) - 4 డక్ అవుట్లు: స్కాట్లాండ్ బ్యాటర్ మెక్లీడ్ 2009-2022 మధ్య 13 మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో 11 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చింది. వీడూ 4 సార్లు పరుగులకే అవుట్ అయ్యాడు.#5 ఆర్.ఈ. వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్/దక్షిణాఫ్రికా)- 4 డక్ అవుట్లు: రెండు దేశాలను ప్రాతినిధ్యం వహించిన వాన్ డెర్ మెర్వే, 2009-2022 మధ్య 21 మ్యాచ్‌లు ఆడాడు. వీడూ 4 సార్లు సున్నా పరుగులకే అవుట్ అయ్యి ఈ జాబితాలో స్థానం సంపాదించాడు.

Advertisement

వివరాలు 

జాబితాలోని ఇతర ఆటగాళ్లు..

ఈ నలుగురే కాకుండా శ్రీలంకకు చెందిన దాసున్ శనక, నెదర్లాండ్స్‌కు చెందిన రోలోఫ్ వాన్ డెర్ మెర్వే వంటి వారు కూడా 4 సార్లు సున్నా పరుగులకే అవుట్ అయ్యారు. విచిత్రమేమిటంటే, ఈ జాబితాలో ఉండే వారంతా దాదాపు బౌలర్లు, ఆల్ రౌండర్లే కావడం విశేషం.

Advertisement