ఐపీఎల్‌లో మరో మైలురాయిని చేరుకున్న ఎంఎస్ ధోని
ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. నిన్న గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు బాది మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదువేల పరుగుల్ని పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అయితే ఈ ఘనత సాధించిన ఏడో ప్లేయర్‌గా ఎంఎస్ ధోని నిలిచాడు. విరాట్ కోహ్లీ 6706 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శిఖర్ ధావన్ 6284, డేవిడ్ వార్నర్ 5937, రోహిత్ శర్మ 5880, సురేష్ రైనా 5528, ఏబీ డివిల్లియర్స్ 5162 పరుగులతో ధోనీ కంటే ముందున్నారు
చెపాక్ స్టేడియంలో 1375 పరుగులు చేసిన ధోని
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 3 బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి 12 పరుగులు చేశాడు. అయితే 89 మీటర్ల దూరంగా అతడు కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలవడం విశేషం. ఈ మ్యాచ్‌లో 12 పరుగులతో తేడాతో లక్నోపై చైన్నై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చైన్నై 217 పరుగులు చేయగా.. లక్ష్య చేధనకు దిగిన లక్నో 205 పరుగులు చేసి పరాజయం పాలైంది. చెపాక్ స్టేడియంలో 49 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, 1375 పరుగులతో సత్తా చాటాడు