Page Loader
వాంఖడే స్టేడియంలో ధోనికి అరుదైన స్థానం
వరల్డ్ కప్ ఫైనల్లో ధోని సిక్సర్ కొట్టిన సందర్భం

వాంఖడే స్టేడియంలో ధోనికి అరుదైన స్థానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2023
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో టీమిండియా మొదటిసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అనంతరం టీమిండియాకు వరల్డ్ కప్ అందని ద్రాక్షలా మారింది. కానీ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో 2011లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో టీమిండియా గెలుపొంది, వరల్డ్ కప్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోని సిక్సర్ కొట్టి జట్టును విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల నిరీక్షణకు మహేంద్ర సింగ్ ధోని తెరదించాడు. ప్రస్తుతం ధోని జ్ఞాపకార్థం వాంఖడే స్టేడియంలో శాశ్వత గుర్తింపును ఎంసీఏ అందించనుంది. వరల్డ్ కప్ ఫైనల్‌లో ధోని సిక్సర్ కొట్టినప్పుడు బంతి పడిన ప్రదేశాన్ని గుర్తించామని, త్వరలోనే ఆ సీటుకు ఎంఎస్ ధోని పేరు పెట్టనున్నట్లు ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపారు.

ధోని

సీటుకు దేశంలో ఆటగాడి పేరు పెట్టడం ఇదే తొలిసారి

స్టేడియం లోపల ఒక సీటుకు MS ధోని పేరు పెట్టాలని MCA సోమవారం నిర్ణయం తీసుకుంది. పేరు పెట్టినప్పుడు ఆ ప్రారంభోత్సవానికి ధోని స్టేడియానికి వస్తానని, అక్కడ అతనికి జ్ఞాపికను కూడా అందజేస్తానని కాలే తెలిపారు. ఇప్పటికే వాంఖడే స్టేడియంలో కొన్నిచోట్ల పాలీ ఉమ్రిగర్, వినూ మన్కడ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్ పేర్లను పెట్టారు. వాంఖడేలోని ఓ సీటుకు దేశంలోని ఆటగాడి పేరు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆస్ట్రేలియాలో, న్యూ సౌత్ వేల్స్‌పై విక్టోరియా తరఫున సైమన్ 122 మీటర్ల సిక్స్‌ను కొట్టినప్పుడు అతని జ్ఞాపకార్థం 1993లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లోని సీటుకు పసుపు రంగు వేసిన విషయం తెలిసిందే.