Page Loader
నేడు కేఎల్ రాహుల్, ధోని సేనల మధ్య ఫైట్.. గెలిచేదెవరో!
నేటి మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ గెలిచేనా

నేడు కేఎల్ రాహుల్, ధోని సేనల మధ్య ఫైట్.. గెలిచేదెవరో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2023
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చైన్నైసూపర్ కింగ్స్ ఓడిపోయింది. నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో చైన్నై తలపడనుంది. చాలా రోజుల తరువాత సొంతగడ్డపై చైన్నై నేడు మ్యాచ్ ఆడబోతుంది. లక్నో విజయం సాధించి ఐపీఎల్ 2023లో బోణీ చేయాలనే జోష్‌తో చైన్నై బరిలోకి దిగుతోంది. మరోవైపు ఢిల్లీపై విజయంతో లక్నో ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఐపీఎల్‌లో చైన్నై, లక్నో ఇప్పటివరకూ ఒకసారి మాత్రమే తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో చైన్నై విజయం సాధించింది. చిదంబరం స్టేడియం పిచ్ స్లోగా ఉండడం వల్ల స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. సొంతగడ్డపై చైన్నై ని ఓడించి ప్రత్యర్థులకు ఎప్పుడూ సవాలే అని చెప్పొచ్చు. మ్యాచ్ సోమవారం రాత్రి 7.30గంటలకు జియో సినిమా యాప్‌లో ప్రసారం కానుంది.

చైన్నై

చైన్నై బ్యాటర్లు రాణిస్తారా..!

లక్నో సూపర్ జెయింట్స్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో కైలే మేయర్, నికోలస్ పూరస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. బౌలింగ్‌లో మార్క్‌వుడ్ ప్రత్యర్థులకు దడ పుట్టినిస్తున్నారు. కేఎల్ రాహుల్ ఫామ్‌లో లేక తంటాలు పడుతున్నారు. మరోవైపు దీపక్ హుడా ఫామ్ లోకి వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చైన్నై మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్‌ను ఝుళిపిస్తూ పరుగులను రాబడుతున్నాడు. కాన్వే, బెన్ స్టోక్స్, రాయుడు, శివమ్ దూబే ఆరంభ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేశారు. రాజ్యవర్ధన్ హంగార్గేకర్ బౌలింగ్ మెరుగ్గా ఉండడం చైన్నైకి కలిసొచ్చే అంశం. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన మునపటి ఫామ్ ను అందుకుంటే చైన్నై విజయానికి తిరుగుండదు.