అరంగ్రేటం మ్యాచ్‌లోనే శభాష్ అనిపించుకున్న రాజవర్దన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. చైన్నై తరుపున అరంగేట్రం చేసిన 21 ఏళ్ల యువకుడు రాజవర్ధన్ హంగర్గేకర్ మొదటి మ్యాచ్‌లోనే అందరి దృష్టిని అకర్షించాడు. ముఖ్యంగా సీఎస్కే తరుపున మూడు వికెట్లు తీసి విజృంభించాడు. నాలుగు ఓవర్లలో (3/36)తో ఐపీఎల్‌లో చెలరేగిపోయాడు. మొదటగా సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. నాలుగో ఓవర్ వేయడానికి రాజవర్దన్‌కు బంతిని అందించాడు. అయితే తన తొలి ఓవర్‌లోనే వృద్ధిమాన్ సాహా(25)ను ఔట్ చేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ (22), విజయ్ శంకర్ (27) కీలక వికెట్లు పడగొట్టి గుజరాత్ స్కోరును కట్టడి చేశాడు.
రాజవర్ధన్ హంగర్గేకర్ అండర్-19లో సాధించిన రికార్డులివే
హంగర్గేకర్ నవంబర్ 10, 2002న మహారాష్ట్రలోని తుల్జాపూర్‌లో జన్మించారు. బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్ కూడా రాణించిన అనుభవం ఉంది. గతేడాది ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా తరుపున కీలక పాత్ర పోషించాడు. అండర్-19 వరల్డ్ కప్ కారణంగా ఐపీఎల్ మెగా వేలంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని బేస్ ధర రూ. 30 లక్షలు కాగా.. సీఎస్కే అన్ని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. హంగర్గేకర్ 13 లిస్ట్-ఎ, నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో వరుసగా 25, 13 వికెట్లు పడగొట్టాడు. ఎఎస్కే తరుపున అత్యంత పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసిన నాల్గొ ఆటగాడిగా హంగర్గేకర్ నిలిచాడు.