Mushfiqar Rahim: వైరైటీగా ఔటైన ముష్పికర్ రహీమ్.. అలా ఔటైన తొలి ఆటగాడిగా రికార్డు!
మిర్పూర్ వేదికగా న్యూజిలాండ్(New Zealand)తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్(Bangladesh) బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్(Mushfiqar Rahim) అనూహ్య రీతిలో ఔట్ అయ్యాడు. ఆ రకంగా ఔటైన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా ముష్పికర్ రహీమ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ముష్ఫికర్ రహీమ్ డిఫెన్స్ ఆడిన బంతి, వికెట్ల మీదకు వచ్చింది. ఈ క్రమంలో చేతిలో ముష్ఫికర్ రహీమ్ బంతిని అడ్డుకున్నాడు. దీంతో అంపైర్లు అబ్ స్ట్రకింగ్ ద ఫీల్డ్ ప్రకారం ఔట్‌గా ప్రకటించారు. ఇక రహీమ్ నిరాశగా పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ పదిమంది ఆటగాళ్లు ఈ రకంగా ఔటయ్యారు. 11వ ప్లేయర్ గా ముష్పికర్ రహీమ్ చేరాడు.
172 పరుగులకు బంగ్లా ఆలౌట్
టెస్ట్‌ల్లో హ్యాండిల్ ద బాల్ నిబంధన ద్వారా ఔటైన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రహీం రికార్డుల్లోకెక్కాడు. స్వదేశంలో న్యూజిలాండ్ జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. బంగ్లా 172 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫిలిప్స్, సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా, అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.