LOADING...
IND vs SA: ముత్తుస్వామి స్వామి సెంచరీ.. దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌట్
ముత్తుస్వామి స్వామి సెంచరీ.. దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌట్

IND vs SA: ముత్తుస్వామి స్వామి సెంచరీ.. దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

గువాహటి వేదికలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు 489 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆటను 247/6 స్కోర్‌తో ఓవర్‌నైట్‌గా ప్రారంభించిన ఆ జట్టు భారీ ఇన్నింగ్స్ ఆడింది. ముత్తుసామి 206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి 109 పరుగుల సెంచరీ నమోదు చేసి జట్టుకు కీలక ప్రదర్శన ఇచ్చాడు. టెస్టుల్లో ఇది అతని తొలి శతకం కావడం విశేషం. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన మార్కో యాన్సెన్ 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 93 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అతను 53 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని సాధించి, చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.

Details

నాలుగు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్

కైల్ వెరినె 122 బంతుల్లో 45 పరుగులు చేసి రాణించాడు. తొలి రోజు ట్రిస్టన్ స్టబ్స్ 49, తెంబా బావుమా 41, మార్‌క్రమ్ 38, రికెల్‌టన్ 35 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా, సిరాజ్, భువనేశ్వర్ కుమార్ రెండేసి వికెట్లు పొందారు.