Page Loader
హాకీ ప్రపంచ కప్‌కు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం
ట్రోఫీతో సీఎం నవీన్ పట్నానాయక్

హాకీ ప్రపంచ కప్‌కు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2022
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాకీ ప్రపంచకప్‌కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వ్యక్తిగతంగా ఆహ్వానించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సూచించారు. సభ్యులందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అఖిలపక్ష ప్రతినిధి బృందం అన్ని రాష్ట్రాలను సందర్శించి, ప్రపంచ కప్‌కు ఆహ్వానాన్ని ముఖ్యమంత్రులకు అందజేయాలన్నారు. భారతదేశంలో పాఠశాలలు, కళాశాలల ద్వారా హాకీ ప్రపంచకప్‌ను ప్రోత్సహించాలని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆయన సూచించారు. G-20 సమ్మిట్‌కు సంబంధించిన మూడు సమావేశాలు వచ్చే ఏడాదిలో ఒడిశాలో జరుగుతాయని, సమావేశాలను విజయవంతంగా నిర్వహించడానికి ఒడిశా ప్రభుత్వం సహకరించాలని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కోరారు.

హాకీ

విద్యార్థులకు హాకీలో అవకాశం కల్పించాలి

ఈ మెగా ఈవెంట్ కోసం అన్ని పార్టీలను ఆహ్వానం పలికేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి నవీన్ పట్నానాయక్ కు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు నరసింగ మిశ్రా అభినందనలు తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాండా ప్రపంచకప్‌కు మద్దతు తెలిపారు. మాజీ హాకీ ఆటగాళ్లలందరిని సత్కరించాలని కోరారు. పాఠశాల నుంచి విద్యార్థులకు హాకీపై అవగాహన కల్పించి, హాకీలో పాల్గొనేలా అవకాశం కల్పించాలని కోరారు. జనవరి 13 నుంచి 29 వరకు ఒడిశాలో హాకీ వరల్డ్ కప్ జరగనుంది. హాకీ ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంతో పాటు.... రూర్కెలాలో కొత్తగా నిర్మించిన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు