Neeraj Kumar: ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్...నీరజ్‌కు కాస్యం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మరోసారి సత్తా చాటారు. ఒకే రోజు రెండు కాంస్య పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ముఖ్యంగా పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో నీరజ్ కుమార్ కాంస్యం గెలవడమే కాకుండా, 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు భారత్‌కు రెండో బెర్త్ కూడా అందించాడు. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జయపాల్ మాల్వియా తొలి ఒలింపిక్ కోటా సాధించగా, ఇప్పుడు నీరజ్ మరో అవకాశాన్ని ఖాయం చేశాడు.
Details
ఫైనల్లో 346.5 పాయింట్లతో మూడో స్థానం
బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఫైనల్‌లో ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డారు.
ఇందులో నీరజ్ 346.5 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. తటస్థ అథ్లెట్‌గా బరిలోకి దిగిన దిమిత్రి పిమెనోవ్ 362.8 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా, స్లొవేకియాకు చెందిన ప్యాట్రిక్ జెనీ 357.2 పాయింట్లతో రజతం సాధించాడు.
వీరిద్దరూ కూడా ఒలింపిక్ కోటాలను దక్కించుకున్నారు. మరో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ 323.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
Details
టీమ్ విభాగంలోనూ భారత షూటర్ల సత్తా
వ్యక్తిగత పతకంతో ఆగకుండా నీరజ్ టీమ్ విభాగంలోనూ భారత్‌కు మరో కాంస్యం అందించాడు.
ఐశ్వరీ ప్రతాప్ సింగ్, అఖిల్ షెరాన్‌లతో కలిసి బరిలోకి దిగిన నీరజ్.. మొత్తం 1751 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
ఇందులో నీరజ్ 582, ప్రతాప్ సింగ్ 587, అఖిల్ షెరాన్ 582 పాయింట్లు సాధించారు. చెక్ రిపబ్లిక్ 1754 పాయింట్లతో స్వర్ణం, నార్వే 1752 పాయింట్లతో రజతం గెలుచుకున్నాయి.
Details
లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌పై పెరిగిన ఆశలు
ఒకే టోర్నీలో రెండు పతకాలు, రెండు ఒలింపిక్ కోటాలు సాధించడం భారత షూటింగ్‌కు మంచి ఊపునిచ్చింది.
ముఖ్యంగా నీరజ్ ప్రదర్శన వ్యక్తిగత ప్రతిభతో పాటు టీమ్ సమన్వయాన్ని కూడా చాటిచెప్పింది.
2028 ఒలింపిక్స్‌కు భారత్ తరఫున మరిన్ని షూటర్లు అర్హత సాధిస్తారనే ఆశలకు ఈ విజయాలు బలాన్నిచ్చాయి.