IND vs ENG Playing 11: ఇంగ్లండ్ పోరుకు కొత్త ప్లాన్.. అభిషేక్‌కు బ్రేక్, డేంజరస్ హిట్టర్‌కు ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్‌తో కీలక సమరానికి సిద్ధమవుతోంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టీమిండియాకు అసలైన పరీక్షగా మారనుంది. వెస్టిండీస్‌పై సంజూ మెరుపు ఇన్నింగ్స్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్ 97 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. అతని ఇన్నింగ్స్ సాయంతో భారత్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. అయితే సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదు. సూపర్-8 దశలో ఇంగ్లాండ్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి మంచి ఫామ్‌లో ఉంది.
Details
ప్లేయింగ్ XIలో మార్పులపై చర్చ
వెస్టిండీస్‌పై గెలిచినా, భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫామ్‌లో లేకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేసింది. ఇప్పటికే జట్టులో ఉన్న ఇషాన్ కిషన్ కారణంగా, అభిషేక్‌ను తప్పించి రింకు సింగ్‌కు అవకాశం ఇవ్వొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఫినిషర్ పాత్రలో రింకూ మెరుగైన ఎంపికగా నిలుస్తున్నాడు. అభిషేక్ గతంలో జట్టుకు మంచి సేవలందించినప్పటికీ, సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్ దృష్ట్యా అతనికి తాత్కాలిక విరామం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఈ మార్పు జరిగితే తిలక్ వర్మను నంబర్-3 స్థానంలో ఆడించే అవకాశం ఉంది.
Details
బౌలింగ్ విభాగం
బౌలింగ్ యూనిట్‌లో జస్పిత్ బుమ్రా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే కొత్త బంతితో అర్ష్‌దీప్ సింగ్ ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయాడు. మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకురావాలనే చర్చ ఉన్నప్పటికీ, సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో అదే బౌలింగ్ కాంబినేషన్ కొనసాగించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ సంభావ్య ప్లేయింగ్ XI సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హర్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఇంగ్లండ్‌పై సెమీఫైనల్ పోరు హై వోల్టేజ్ మ్యాచ్‌గా మారనుంది. జట్టు ఎంపిక, వ్యూహాలు, ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ మొత్తం కలిపి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనున్నాయి.