NZ vs AFG: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై న్యూజిలాండ్ విజయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 08, 2026
02:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 17.5 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో న్యూజిలాండ్ బ్యాటర్ల ప్రదర్శన కీలకంగా నిలిచింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ అద్భుతమైన ఆటతీరుతో 65 పరుగులు చేసి అర్ధశతకం సాధించాడు. అతడికి గ్లెన్ ఫిలిప్స్ 42 పరుగులు, మార్క్ చాప్‌మన్ 28 పరుగులతో మద్దతిచ్చారు. చివర్లో డారిల్ మిచెల్ అజేయంగా 25 పరుగులు చేసి జట్టును గమ్యానికి చేర్చాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహమాన్ రెండు వికెట్లు తీసి ప్రభావం చూపగా, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ తలో వికెట్ సాధించారు.