రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు విఫలం.. సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్
రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేయడంతో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుది. న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ డబుల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. లంక పోరాటం కారణంగా తొలి టెస్టు ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. మొదటి టెస్టులో చివరి బంతికి న్యూజిలాండ్ విజయం సాధించింది. రెండోటెస్టులో శ్రీలంక బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. వెల్లింగ్టన్ టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది.
కేన్ విలియమ్సన్‌కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
కేన్ విలియమ్సన్, హెన్రీ నికోలస్ డబుల్ సెంచరీ చేసి న్యూజిలాండ్ తరుపున అరుదైన రికార్డులను సాధించారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 164 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక 142 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌటైంది. దిముల్ కరుణరత్నే 51 పరుగులు, కుశాల మెండిస్ 62 పరుగులు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. డిసిల్వా 98 పరుగులు చేసి త్రుటిలో సెంచరీని మిస్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో టిమ్ సౌథీ మూడు వికెట్లు, టింకర్ మూడు వికెట్లు, బ్రాస్ వెల్ రెండు వికెట్లు తీసి విజృంభించారు. హెన్రీ నికోలస్ 'మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ ' అవార్డు లభించగా.. కేన్ విలియమ్సన్‌కి 'ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్' అవార్డు దక్కింది.