
టెస్టుల్లో ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టులో శ్రీలంక ఆటగాడు ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 185 బంతుల్లో 98 పరుగులు చేసి అరుదైన ఫీట్‌ను సాధించాడు.
టెస్టు ఫార్మాట్లో 3,000 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 98 పరుగులు చేసి త్రుటీలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
డిసిల్వా తన 47వ టెస్టులో 3000 వేల పరుగులు చేశారు. టెస్టుల్లో ఈ మైలురాయిని చేరుకున్న 15వ బ్యాటర్‌గా డిసిల్వా నిలిచాడు. టెస్టుల్లో తొమ్మిది సెంచరీలు, 11 అర్ధ సెంచరీలను బాదాడు. బౌలింగ్ విభాగంలో 55.26 సగటుతో 34 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్
టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 580/4 స్కోరు చేసి డిక్లేర్ చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్, శ్రీలంకను ఫాలో ఆన్ చేయమని కోరింది.
రెండో ఇన్నింగ్స్‌లో 116/4 స్కోరు ఉన్నప్పుడు క్రీజులోకి దిగిన డి సిల్వా, చండిమాల్ (62)తో కలిసి 126 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం నిషాన్ మదుష్క (39)తో కలిసి 76 పరుగులు జోడించాడు.
రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 358 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.